Saturday 17 June 2023

కరుణించు కంధరమా

             కరుణించు కంధరమా

.                       (విరించి) 


తొలకరి పలకరింపగ
పులకించిన పుడమితల్లి
పరిమళ తావులీనెడి 
తరుణము కొరకై వేచిన
హాలికుల యాశలన్నియు
యడియాశలు చేయుచున్న
యంబరవీధిని దాగిన
యంభోదములవిగో
యులకక పలకక
ఉరుములు మెరుపుల ఊసెత్తక
రెట్టించిన ఉత్సాహముతో 
ప్రచండుడై రేగుచున్న
రాగుడి ప్రతాపాగ్నికి
ఆజ్యంపోస్తూ ... తన కర్తవ్యాన్ని
మరచిపోయిన మేఘాల్లారా!
కదనోత్సాహము చూపుచు 
కణకణలాడే కాంకుని జోరు
తగ్గించుచు మీకే తెలియని
మీ శక్తి సామర్థ్యాలను 
వెలికితీసి ....
ఎండి బీటలు బారుతున్న 
ధరణీతలముపై 
హర్షము నిచ్చే వర్షపు నీటి
కళ్ళాపి జల్లగ కురియవెందుకు?
వేదనతో నీ కరుణని కురిపించమని
వేడుకునే హాలికుల వ్యధను బాపవెందుకు?

1 comment:

  1. తొలకరి వాన వెలిదీసే భారతావని సౌరభమ్ముకై పిలుపు మీ పదజాలంలో బహుభేషుగా గుబాళించిందండీ!

    ReplyDelete