Monday 14 April 2014

పానకాలుకు సన్మానం

                                               పానకాలుకు సన్మానం
                                                              రచన: విరించి
________________________________________________________________

     ఆరోజు ఆదివారం మా ఆఫీస్ కు సెలవు. మా ఆఫీస్ కు సెలవంటే మీ ఆఫీస్ కు సెలవు లేదని కాదు,
అందుకే మా ఆఫీస్ కు సెలవన్నానే కాని మా ఆఫీస్ కు మాత్రమే సెలవన లేదుగా ..... అర్థం చేసుకోండి.
ఈ చిన్న విషయానికే రాద్దాంత మెందుగ్గాని ఆరోజు ఆఫీస్ కు సెలవు కాబట్టి ఆలస్యంగా నిద్ర లేచాను.

     ఆలస్యంగా లేవడం వల్ల కాస్త ఒళ్ళు బద్దకంగా వుంది,  ఉన్నా సరే లేవాల్సిందే కదా!..... అందుకే లేచి, షెల్ఫ్ లోంచి గోల్డ్ ఫ్లేక్ పాకెట్ లోంచి ఓ సిగరెట్ తీసి పెదాల మధ్య పెట్టుకొని  నిప్పంటించుకుని గుండెల నిండా దమ్ము పీల్చుకుని మెల్లిగా పొగ వదులుతూ డ్రాయింగ్ రూం కేసి కదలాను. ఆ రోజు పేపర్ చూడ్డానికి.

     ఎందుకో కిటికీ లోనుండి వీధి వైపు దృష్టి మళ్ళింది, మా ఇంటిముందే కొత్తగా రాత్రికి రాత్రే ఓ పెద్ద
ఫ్లెక్షిని పెట్టినట్టున్నారు .... ఆ ఫ్లెక్షి కనిపించగానే ఏమిటబ్బా విషయమని దృష్టి సారించాను.

     ఆ ఫ్లెక్షి లో పానకాలు నిలువెత్తు ఫోటో ..... అదే మా పనిమనిషి రంగమ్మ మొగుడు పానకాలు ......
 ఆ పానకాలు  లాగే ఆ ఫ్లెక్షిలొ ఓ ఫోటో  కనిపించింది.

     పానకాలుకు ఫ్లెక్షిలొ ఫోటో లేయించుకునేంత సీనేం లేదు,మరి ఈ ఫోటో ఎంటబ్బా! అని అనుకునేంత లోనే నేను కళ్ళజోడు పెట్టుకోలేదన్న విషయం గుర్తు కొచ్చింది.

     "జోడు లేక పోవడం వల్ల సరిగా కనిపించక పానకాలు లా కనిపిస్తుందేమో అనుకున్నాను. అంతలోనే చత్వారం తో దృష్టి ఆనక అంతా అలికినట్టుగా కనిపించాలి గాని ఒకరి ఫోటో మరొకరి ఫోటో లా కనిపించ కూడదే, అని కూడా అనుకున్నాను.

     అయినా ఇదో కొత్త రకం జబ్బేమైనా కావచ్చు. ఒకరి ఫోటో ను చూస్తే మరోకరిలా కనిపించే జబ్బు ఏదైనా కొత్త గా  మార్కెట్ లో కోచ్చిందేమో! ఏంటో పాడు కొత్త కొత్త జబ్బులోచ్చేస్తున్నాయ్. ఆదివారం ఏ ఆస్పత్రి ఉంటుందో ఏ ఆస్పత్రి ఉండదో, ఈ కొత్త జబ్బు కెవరు సరైన ట్రీట్మెంట్ ఇస్తారో ....... రేపు ప్రొద్దునే వెళ్లి చెక్ చేయించు కోవాలి" అనుకుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి కళ్ళ జోడు తెచ్చుకుని జోడుతో చూసా  ఆ ఫోటో అచ్చంగా పానకాలుదే.....సందేహం లేదు.

     ఈ పానకాలు గాడికి ఫ్లిక్షిలొ ఫోటో వేసుకునే సీనెలవచ్చిందబ్బా! అసలా ఫ్లెక్షిలొ వాడి   ఫోటో ఎందుకు....      ఆ అవసరం ఎవరికీ ..........అని నాలో నేనే వేయి ప్రశ్నలని వేసుకుని బాధ పడుతుంటే నా మనసు నాకు బుద్ధి చెప్పింది...................." ఏరా ఓరి చదువుకున్న వెధవా! ....ఆ ఫ్లెక్షి లో బంగినపల్లి మామిడి కాయల కంటే పెద్దవైన అచ్చ తెనుగు అక్షరాలు ఉన్నాయ్ చదివితే నీకే తెలుస్తుంది కదరా!" అని హెచ్చరించడం తో నా తొందర పాటుకు నేనే చింతించి ఆ అక్షరాల వైపు చూసాను  ఒక్కో అక్షరం కోనసీమ కొబ్బరి బొండాల కన్నా పెద్దగా ఉన్నాయ్, ఇంకెందుకాలస్యమని చదవడం ఆరంభించాను

     త్యాగశీలి నిస్వార్థ పరుడు పరమ దేశ భక్తుడు పానకాలు గారికి గౌరవ మంత్రి వర్యులు శ్రీ బక్కయ్య గారి చేతుల మీదుగా సన్మానం మరియు త్యాగరత్న, దేశబంధు బిరుదు ప్రధానం  అని రాసుంది.   

     అది చదివిన నా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది," ఈ పానకాలు కేమిటి సన్మానం ఏమిటి ? అసలు నేను మెలకువ గానే ఉన్నానా లేక తెల్లవారు జామున నిద్రలో కలగంటున్నానా?" అని నాకు నేనే గిచ్చు కున్నాను.  నెప్పిగా వుంది.

      కలలో గిచ్చుకున్నా నెప్పిగా ఉంటుంది గామాలు అనుకొని నా సందేహాన్ని తీర్చుకోవాలన్నా పట్టుదలతో నా శ్రీమతిని కేకేసాను.

     "ఏమిటోయ్! ఓ సారిలా వస్తావా?......."అని పిలిచా

     " ఏంటండీ!  ప్రొద్దునే ఆ కేకలు!" అంటూ లోపలి నుండే   విసుక్కుంది. సాయంత్రమైతే కేకలు వేయడానికి పర్మిషన్   ఉన్నట్టు.

      " రావోయ్ తొందరగా ఇక్కడో తమాషా చూపిస్తా"...... అన్నాను ఆలస్యాన్ని భరించలేక.

     వంటింట్లో చేస్తున్న పనిని వదిలేసి గొణుగుతూ వచ్చింది,చాలా తీవ్రంగా పనిచేస్తున్నట్టుంది చీర తడవ కుండా ఉండాలని  కుచ్చిళ్ళని అరగజం పైకి ఎత్తి  బొడ్డులో దోపుకోవడం వల్ల కుడికాలు మోకాలు కంటే నాలుగంగుళాల పై వరకు పచ్చని పసిమి రంగు పిక్కలు  గుండ్రటి అందమైన మోకాలు బంతి  ఆ నునుపు కనిపించి నన్ను ఊరిస్తుంటే కళ్ళప్ప గించుకుని ఆ కాలి అందాలనే చూడసాగాను.

     నా చూపులెక్కడున్నాయో గమనించి తన కుచ్చిళ్ళను సరిచేసుకుంటూ, ముసి ముసి గా నవ్వుతు "ఇందుకేనా పిలిచింది" అంది. ఆ  కంఠం లో కావాలని తెచ్చి పెట్టుకున్న కోపాన్ని ప్రదర్శించింది.

    " ఆ.... అవును మరి..... ఎప్పుడు నిన్ను  చూడలేదని ఇలా పిలిచి నీ అందాలను జుర్రు కుందామని ఇంతోటి అందాల సుందరి ఏడేడు లోకాలలో లేదని......."అంటూ చిన్నగా నవ్వి  . " ఎప్పుడు నాతో నీ అందాల స్తోత్రం జరిపించు  కుందామని ఎంత కోరికరా నీకు" అని  ఆట పట్టించి   " ఇలా రా ! అక్కడ ఏముందో చూడు." అన్నాను.

     నేను ప్రత్యేకంగా పిలిచి చూపించాల్సినంత విశేషం ఏమిటా అని కిటికీ దగ్గరికొచ్చి నా ముందు నిలబడి వీధి వైపు చూడ సాగింది.

     వీధిలోకైతే చూస్తుంది కాని ఎం చూడాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తున్నా..... ఏమి కనిపించ క పోయేసరికి     "ఎక్కడండీ...." అని అడిగింది.

       ఆమెకు చూపాలని కాస్త దగ్గరికి జరిగా నా ఎడం చేయిని ఆమె భుజం పై వేసా, నా వేడి నిశ్వాసం ఆమె మందారాల్లాంటి బుగ్గలని స్పృ షిస్తుంది. నా వక్షస్థలం ఆమె వీపుకి తగులు తుంది. ఆ స్పర్శ లోని మాధుర్యాన్ని గ్రోలుతూ నేను చూపిన ఫ్లెక్షిని చూసింది. 

     "ఓస్..... ఇంతేనా వాడెవడో  పానకాలు వాడికి సన్మానం ఆ సన్మానమేదో  మీకే జరుగుతున్నట్టు దీనికింత హడావిడా....? లోపల నా పనంత పాడు చేసారు" అంటూ వెనక్కు తిరిగింది .

     అలా తిరగడం తో ఆమె స్తనద్వయం నా వక్ష స్థలాన్ని డీ కొట్టడం తో అసంకల్పిత ప్రతీకార చర్యలా నా చేతులు రెండూ ఆమెని చుట్టేసాయి.

     ఆమె అలాగే నా కౌగిట్లో ఒదిగి పోతూ   " రాత్రి చేసిన చిలిపి పనులు చాలలేదా!..... మళ్ళీ ప్రొద్దున్నే తయారయారు, ముఖం లేదు స్నానం లేదు, వెళ్ళండి ముందు స్నానం చేసిరండి," తీయగా కసిరింది నా కౌగిట్లో కరిగి పోతూనే.

      "స్నానానికి ముందే సరసాలాడాలోయ్, తర్వాత ఇద్దరం కలిసి ఏకంగా సరిగంగ  స్నానాలాడదాం.."అంటూ ఆమె పెదాలను నా పెదాలతో అందుకో బోయాను .

     " ఊ చాలు చాలా స్పీడై పోయారు, పిల్లలు ఎవరో ఫ్రెండ్స్ వస్తే ఇప్పుడే వస్తామని వెళ్ళారు ఏక్షణాన్నైనా రావచ్చు,....... లోపల రంగమ్ముంది." నా చేతులని తప్పిస్తూ అంది.

     రంగమ్మ  పేరు చెప్పగానే నాకు ఫ్లెక్షి గుర్తు కొచ్చింది.

      "ఆ ఫ్లెక్షి లో ఉన్న పానకాలు ఎవరో తెలుసా..........?" అడిగాను.

       తెలియడానికి అతనేమైన సి యమా,  పియమా  అంటూ నాకు ఇంకాస్త దగ్గరగా జరిగి నా  పెదాల పై ముద్దు పెట్టుకుంది.

అసంకల్పితమైన ఆ చర్యకు నా మనసెక్కడో అంతరాలలో విహరించడానికి వెళ్ళిపోయింది, ఆ మధురానుభూతిలో కాసేపు అలాగే ఉండిపోయాను.

       తీయనైన ఆమె లేత తమలపాకుల్లాంటి యెర్రని పెదిమల స్పర్శ ని , ఆమె అధరామృతపు కమ్మ దనాన్ని ఆస్వాదిస్తూ   ఓ నిమిషం పాటు కళ్ళు మూసుకుని ఉండిపోయాను. తర్వాత ఈ లోకానికోచ్చి  " "అతనేం సియం కాదు పియం కాదు కానీ మన రంగమ్మ మొగుడు" అన్నాను.

     ఆ మాటకు ఉలిక్కి పడడం ఈసారి ఆమె వంతైంది.     "రంగమ్మ మొగుడా !?,,,,,, ఏ రాచ కార్యం వేలగాబెట్టాడని ఈ సన్మానం." అడిగింది నన్నే.

       "అదేనోయ్ వాడికెందుకీ  సన్మానం! సంసారానికి కూడా అక్కరకు రాని అర్ధాణా కు విలువ లేని వాడికేందుకీ సన్మానం........?"అని ఇంకా ఏమో అన బోయెంతలోనే ఆమె నన్ను అనుమానంగా చూస్తూ

        "ఏంటీ! వాడు సంసారానికి పనికిరాడా?.... మరి రంగమ్మ  కి నలుగురు కొడుకులు .... ఈ విషయం అంటే వాడు అర్ధాణా కు కొరగాని విషయం    మీకు తెలుసు, అంటే మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.........అదే నండి  మన చిన్నాడు పొట్టలో ఉన్నప్పుడు, నేను పురుడికి వెళ్ళినప్పుడు రంగమ్మ వంట కోసమని మధ్యాహ్నాలు వచ్చిన విషయం నిజమేనన్న మాట" అంది ముక్కు ఎగ బీలుస్తూ.

       ''అయితే ఏమిటోయ్ నీ ప్రాబ్లం" అడిగాను.

        "చేసేవన్నీ చేసి నంగనాచి తుంగ బుర్రలా నటించకండి, ఆమె పెద్ద కొడుక్కన్నీ మీ పోలికలే నాకిప్పుడు అర్థమవుతుంది, మీరు సామాన్యులు కారు". అంది.

         అప్పుడు ఆమె మాటలకర్థం తెలిసి షాక్ అయ్యాను, "ఛీ!  ఛీ! అవేం మాటలు, వాడు సంసారానికి అక్కర రాడన్నానే కాని పనికి రాదనలేదే పిచ్చి మొద్దు," రాని నవ్వుని ముఖానికి పేస్ట్ ల తగిలించుకుని అన్నాను.

   "నేను చదివింది ఇంగ్లీష్ మీడియం అయినా నాకు తెలుగు వచ్చు లెండి అక్కరకు రాడన్నా పనికి రాడన్నా ఒకటే అర్థం " జీర బోయిన కంఠం తో పైట కొంగుతో ముక్కు తుడుచుకుంటూ అంది.
   
        వాడు సంపాయించిన ప్రతీ పైసా వాడి తాగుడుకే ఖర్చు పెట్టుకుంటాడు కాని ఇంటి ఖర్చులకు ఒక్క పైసా ఇవ్వడన్న ఉద్దేశం లో అన్నానే.
         అయినా జగదేక సుందరి లాంటి భార్యవు నువ్వుండగా నాకు వేరే వారెందుకోయ్,  నువ్ నాకు ఏం తక్కువ చేస్తున్నావని అడ్డ దార్లు తొక్కుతాను చెప్పు, కొందరు భార్యలకు  భర్తలను సుఖపెట్టడం తెలియదు. శృంగారం అంటేనే ఒక పాప కార్యమని  మూర్ఖత్వం తో శృంగారాన్ని మొక్కుబడి కార్యం గా భావించే భార్యల  భర్తలు బయటి సంబంధాలకొరకు ఆరాట పడతారు.
  
           నీలాంటి రతీ దేవివి వుండగా వేరే వారు నాకేందుకోయ్." అని చెప్పి నమ్మించేసరికి ణా తల ప్రాణమ్ తోక కోచ్చినంత పనైంది.

    పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది నా శ్రీమతి. తుఫాను వేలిసినట్టుగా ఫీలయ్యాను

     లోపల పనులన్నీ పూర్తి చేసుకుని చీపురు తో గది ఊదవ దానికి వచ్చింది రంగమ్మ, అలా వంగి ఊడుస్తుంటే ఆమె పైట కొంగు స్థాన భ్రంశం చెంది కనిపించింది.

       అంత వరకు రంగమ్మ ని అలాంటి దృష్టితో చూడలేదు కాని ఈరోజు నా భార్య మాటల ప్రభావం కావచ్చు ఎంత వద్దనుకున్నా నా కళ్ళు ఆమె జారిన పైట కొంగు వైపే వెళ్తున్నాయి.

          మనసు కోతి లాంటిది కదా! ఈ అనుమానాలే  కొత్త ఆలోచనలకు దారి తీస్తుందేమో అనిపించింది,

     రంగమ్మ కాస్త నలుపైనా పర్సనాలిటి ఎంతో సెక్షీగా వుంది ఎక్కడ ఎంతెంత ఎత్తులుం    డాలో ఎక్కడెక్కడ ఎంత వంపులుండాలో అంతే ఉండి ఎదుటి వారి గుండెల్లో గుబులు రేపెలా వుంటుంది .ఒక పరాయ్ ఆడదాన్ని ఆ దృష్టితో చూడ్డం ఇదే మొదటి సారి. ఇదే ఆఖరి సారి కూడా కావాలి మరి లేదా బంగారం లాంటి సంసారం లో చిచ్చు రేగుతుంది. బలవంతంగా నా దృష్టిని ఆమెపైనుండి మరల్చాను.

         ఈ ఆలోచనలకు  ఇక్కడితో  ఫుల్ స్టాప్   పెట్టేసి సాయంత్రం పానకాలు సన్మాన సభకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నా,

మాతో పాటే రంగమ్మను తీసుకెళ్తానని చెప్పగానే ఆమె ఎంతో సంబర పడింది .
                              
********  *******    ********          ***********          **********      ***********    ***********

      మునిసిపాలిటి వాళ్ళ ఒక చిన్నపాటి పెద్ద ఆడిటోరియం జనాలతో క్రిక్కిరిసి ఉంది. ఆ జనాలను చూసి నేనే ఆశ్చర్య పోయాను ఈ పానకాలుకు ఇంతటి ఫాలోయింగా అని, తర్వాత ఎవరో అనుకొనగా తెలిసింది వాళ్ళంతా ఊరికే రాలేదని ఒక్కొక్కరికి   రెండేసి వందల రూపాయలు మూడేసి సారా పాకెట్లు ఇస్తామని చెప్పి తీసుకోచ్చారట. ఏ ప్రతిఫలం ఆశించ కుండ వచ్చింది మా కుటుంబం మరియు రంగమ్మ మాత్రమే.

    అనుకున్న సమయానికి అరగంట లేటుగా వచ్చారు అమాత్య వర్యులు, అతన్ని చూడగానే మన ప్రభుత్వాలు ఎంత లేదని చెబుతున్నా ఆహార కొరత తీవ్రంగానే ఉండి తీరుతుందన్నది నా స్థిర మైన అభిప్రాయం.

    ఐదున్నర అడుగుల ఎత్తు సుమారు పదమూడడుగుల చుట్టు కొలతతో  సర్కస్ లోంచి పారిపొయొచ్చిన గున్న ఏనుగులా ఉన్నాడు, రాష్ట్రం లో ఉత్పత్తి ఐన మొత్తం ఆహారమైనా అతనికే చాలేలా లేదు ఇక జనాల కెక్కడిది. అందుకే మనకు ఆహార కొరత తప్పదు.

      మంత్రి గారు వచ్చీ రావడం తోనే తనకు వేరే ప్రోగ్రాం లున్నాయని వెంటనే వెళ్లాలని చెప్పడం తో కార్యక్రమం హడావిడిగా ప్రారంభమైంది.

       స్టేజి పై ఓ ప్లాస్టిక్ కుర్చీ వేసి పానకాలును కూర్చోబెట్టారు, మంత్రి గారు చేతిలోకి మైకు తీసుకొని, తమ ప్రభుత్వం చేసామని భావిస్తున్న చేయని పనుల గురించి  చేయడానికి సాధ్య పడని చేయబోయే పనుల గురించి ఊహలకే అందని సరికొత్త ప్రణాళికల గురించి ఓ పది నిమిషాలు కామాలు ఫుల్ స్టాపు లు లేకుండా చెబుతుంటే నేనాశ్చర్య పోయాను

    వీళ్ళింతలా చేస్తుంటే ఇంకా మన రాష్ట్రం లో ఈ పేదరిక మెట్లున్నది, రైతుల నేత కార్మికుల ఆత్మ హత్యలు ఆగడం లేదెందుకు. ఈ విషయాలు అర్థం కాక తల పట్టుకున్నాను.

     ఇక సన్మానం ఆరంభమైంది,

     ఇంకా ఈ సన్మానం ఈ పానకాలుకు ఎందుకు చేస్తున్నారో మాత్రం అర్థం కాలేదు.

     ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన ఓ బంతిపూల దండను పానకాలు మేడలో వేసి,నూటాముప్పై కి కొనుక్కొచ్చిన ముదురు ఆకుపచ్చ శాలువాను కప్పి పది బై పన్నెండు సైజ్ లో ఉన్న మేమేంటోను  చేతిలో పెట్టి అందరిని చప్పట్లు కొట్టమని మైకులో చెప్పారు.

      హాలంతా చప్పట్లతో మారు మ్రోగి పోయింది.

      తన పని పూర్తి చేసుకొని మంత్రిగారు వెళ్ళిపోయారు.

      ఇప్పుడు మైకు ఓ లోకల్ లీడర్ చేతిలోకి పోయింది,   

    అతనో దగ్గు దగ్గి మైకును వ్రేలుతో ఓసారి కొట్టి ఇలా చెప్పడం ఆరంభించాడు  "ఈ రోజు ప్రముఖ త్యాగ మూర్తి, నిస్వార్థ పరుడు అచంచల దేశ భక్తుడు మాననీయ పానకాలు ను సన్మానించు కోవడం మన అదృష్టంగా భావిస్తాను" అని చెప్పాడు.

     "ఈ సన్మానాలు అగ్రవర్ణాల వారికి కార్పోరేట్ వ్యాపారులకే ఇంతవరకు పరిమితమై ఉండేవి, కాని ఈరోజు ఓ దళిత వెనుక బడిన వర్గాలకు చెందినా సామాన్యులకు కూడా అందుబాటులోకి తేవాలని దాని ద్వారా సామాజిక న్యాయం అందజేయాలని మా ప్రభుత్వం నిర్ణయించడం మీ అందరి విజయం. అందులోని భాగంగా ఓ సామాన్యున్ని ఎందుకూ పనికి రాని వాడిన ఈ పానకాలును సన్మానిస్తున్నాం."

    అతనలా చెబుతుంటే నాకతను పానకాలును పొగడు తున్నాడా తెగడు తున్నాడా అర్థం కాలేదు.

         తిరిగి ప్రారంభించాడు " పానకాలు ప్రభుత్వోద్యోగా కాదు కంట్రాక్టరా  కాదు అంటే అతను సర్కారు నుండి ఒక్క పైసా తీసుకోవట్లేదు పైగా ప్రభుత్వ ఆదాయానికి అతని సహకారం ఎంతో ఉంది.

   రాష్ట్రాదాయం లో సింహ భాగం మద్యపానం నుండే వస్తుంది కదా అందుకే జిల్లాల వారిగా ఎవరైతే ఎక్కువ మద్యపానం సేవిస్తారో వారిని సన్మానించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ జిల్లాలో మన పానకాలు ఎన్నికయ్యాడు.

   ప్రభుత్వోద్యోగులు జీతాల కొరకు  సమ్మె చేస్తారు సర్కారు సొమ్ముకు ఆశ పడతారు, కాని పానకాలు సమ్మె చేయదు సర్కార్ పైసాకు ఆశ పడడు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక రాష్ట్ర ఖజానా పెంచుతున్నాడు". అని చెప్పి చివరగా పానకాలు ని సందేశం ఇవ్వవలసినదిగా ఆహ్వానించాడు.

    పానకాలు లేచాడు మైకు ముందుకొచ్చి

       "అయ్యలారా! దండాలు, నేను బాగా తాగుతానని బందు చేయమని నా భార్య ఎంత సతాయించినా వినను  ఎందుకు వినాలి? ప్రభుత్వం సారా దుకాణం పెట్టింది ఎందుకు మనం తాగాలనే కదా! ..........
సర్కారు దవఖానాలు కావాలి వాళ్ళు పెట్టిన రేషన్ షాప్ లు కావాలి వాళ్ళ స్కూల్ లు కావాలి కానీ వాళ్ళ సారా దుకాణాలు వద్దా ఇదెక్కడి న్యాయం. అందుకే తాగుతున్నా.

         మేం తాగితేనే సర్కారుకు పైసలొస్తయ్ వాళ్లకు పైసలోస్తేనే నౌకర్ దార్ లకు జీతాలిస్తారు, అంటే కలెక్టర్ కాడికెల్లి కండాక్టర్ దాక మనమిచ్చే పైసల తోని బతుకు తున్నరు, మనమ తాగుడు మానుకుంటే వాళ్ళ పెండ్లాం పిల్లలెట్ల  బతుకుతరు.

     ఇగ మన ఆడోల్లు తాగొద్దు తాగొద్దు అనున్నారు, రాత్రి తాగి ఇంటికి పోతే   మన నోర్లు వాసనొస్తున్నాయని మన భార్యలు మన పక్కకు కూడా రావట్లేదు, మీద చెయ్యి వేయనీయట్లేదు, ఎంతైనా ఉప్పు కారం తినేటోల్లం కదా కూడెట్లనో మనిషికి గా సుకం కూడా కావాలె కనుక సర్కారోల్లు  ప్రతి ఊర్ల గీ సారా దుకాణం పెట్టినట్లే  సాని దుకాణం పెట్టాలి.

    మా భార్యలు దగ్గరికి రానీయకుంటే  ఆడికి పోయన్న సుక పడతం గట్ల మీకు కూడా పైసలు  ఎక్కువగానే వస్తయ్

    రోగాలోస్తాయని భయ పెడుతున్నారు, వస్తే ఏమైతది   ఆరోగ్య శ్రీ  ఉండనే ఉండే.

     మేం ఖుషీ చెయ్యాలే సర్కారుకు పైసల్ రావాలే గంతే " అని చెబుతుంటే నేను నోరెళ్ళ బెట్టాను .     

     

Saturday 12 April 2014

వసంతగానం

                                                                   వసంత గానం
                                                                              విరించి

శీతలా నిలముల శిశిరంబు మరుగాయే
                        మండు వేసంగియే మరలి వచ్చె
అభిసారికై ధాత్రి అందాల ప్రియుడైన
                        వరుణు కై వేచియే వ్రయ్యలయ్యె
కొదమ తేటుల ధాటు మధువు నన్వేషింప
                        పూదోట దిరుగంగ పూవు పూవు
బంబరంబుల పక్ష భ్రమర నాదాలతో
                       భూపాల రాగాలు పోటులెత్తె
       భాను తప్త మైన వాయువుల్ చెలరేగి
       వేడి వడిన వీచు వేళ ఇదియె
       వసుధ నే రమింప వడగండ్ల వానయై
       వరుణ దేవు డిలకు వచ్చు నిపుడు
నిరుడు కూసిన పిట్ట సరిగమ రాగాల
                     తిరిగి యాలాపించు వేళ ఇదియె
నవ పల్లవంబుల నవ నవోణ్ మేషంబు
                     నేలనే మురిపించు వేళ ఇదియె
ఖగ జాతి కువ కువల్ కమనీయ దృశ్యాల్
                     మేళవింపుల మేటి వేళ ఇదియె
మంచు తెరల్ తొల్గి మరులు గొల్పెడు రీతి
                    కౌముదుల్ విరిసేటి కాలమిదియె
          పడతి తనువు జేరు పరువాల వాలేను
          వంపు సోంపు లన్ని వసుధకమరి
          కులుకు లీనుచుండె కువలయ మీవేళ
          మదిని దోచు మాస మాగ మించె


పల్ల వించిన నవ పల్లవంబుల చేత
          పాదపముల శోభ పరిడ విల్లె
విరియ కాసిన ఫల బరువుచే మావిళ్ళు
          నిండు చూలాలున్న నెలత లయ్యె
పూప పల్లవముల పొట్టార భుజియింప
           కలకంటి కంటాన కలిమి నిండె
మురిపాన గళమెత్తి మోహన రాగాన
           స్వాగాతాల్ పల్కె వసంతమునకు


           పులుగు పాటతోడ పులకరించిన నీవు
           వసుధ మురియు నిండు వర్ష మిచ్చి
           పాడి పంటల నిచ్చి పసిడి రాశుల నిచ్చి
           శాంతి నొసగు మో వసంత కాంత   
            
 

దేవుడా నిన్నేమనాలి

                                                         దేవుడా నిన్నేమనాలి                                                                              విరించి

ఎదుటి వాన్ని  బాధించి
వాడేడుస్తుంటే ఆనందించే వాడు
శాడిష్టైతే
దేవుడా నిన్నేమనాలి?

మానవులను సృజించి
మనసనే ఒక రసాంగాన్నందు ఆపాదించి
ప్రేమ అనే అనుభూతుల కల్పించి అనురాగాన్ని రంగరించి
రాగ బంధాలనే బందిఖానాలో బంధించి
ముందస్తు సూచన లేకనే
మరణమనే ఒకే ఒక వ్రేటుతో
పుటుక్కున బంధాలను త్రెంచి
బంధు జాలమంతా ఏడుస్తుంటే
నువ్వానందిస్తున్నావ్

అందాల హరిణాలను సృష్టించి
హరిణ మాడెడు అరణ్యాలలోనే
ఆహారంగా వేటాడెడు వ్యాఘ్రాలను
సృష్టించావ్

తాము బ్రతక డానికవి బలహీన
మృగాలను వేటాడుతుంటే
బక్క జీవులు ప్రాణ భయం తో
చావు కేకలు వేస్తుంటే
చూస్తూ ఆనందిస్తుంటావ్.

నిన్ను లీలా మానస మూర్తివని కీర్తించాలని
మాలో మమ్ము కొట్టుకు చచ్చేలా చేస్తున్నావ్
ఈలోకం లో బలహీనుడు బ్రతక కూడదా స్వామీ
బలమున్నోడే చుట్టమనుకుంటే
బలహీను ని  బలవంతుడి కి ఎర గా మార్చిన ఓ దేవుడా
నిన్నేమనాలి? ఏ పేరున పిలవాలి?