Sunday 30 March 2014

మానవత్వం

     మానవత్వం పరిమళించిన మహా మనిషి

  ఇది కలియుగం మానవ బంధాలన్నీ ధన బంధాలే అంటారు, ఒక్కోసారి అవి వాస్తవాలే అనిపిస్తాయి, క్షమించండి  ఒక్కోసారి కాదు ప్రతీ సారీ అదే నిజమని రుజువవుతుంది.

   ఒకప్పుడు మానవులు అర్తిగత ప్రాణులు, తర్వాత అన్నగత ప్రాణులు గా మారారు, మరి ఇప్పుడు ధన గత ప్రాణులుగా మారారు. ఇదే నిజం ఇదే కలియుగ   ధర్మం

    కాని ఇంకా ఈ భూమి పై మానవత్వం మిగిలి వుందని మనుషులు మనుషులు గా వ్యవహరిస్తూ సాటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలను చూపించి, సాటి వారిని కేవలం మాటల సాయమే కాదు ఆర్ధిక, మానసిక, భౌతిక, సాయాన్నందించిన ఒకరి గురించి న వాస్తవం ఇది.

    దిల్ సుఖ్ నగర్ లో వుండే  శివ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరు తన విశాల హృదయాన్ని ప్రదర్శించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.

      కృష్ణ అనే 22 సంవత్సరాల వయసు అబ్బాయ్ అనారోగ్య సమస్య ఎదురై హాస్పిటల్ కెళ్ళాడు అక్కడ సుమారు నలబై ఐదు వేల ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడం తో చిరు వ్యాపారం చేసుకునే కృష్ణ అంత డబ్బు తన వద్ద లేదని ఆపరేషన్ చేసుకోవడాన్ని మానుకున్నాడు, ఈ విషయం తెలిసి శివ  తాను యాభై మూడు వేల రూపాయలని ఖర్చు చేసి కృష్ణకి ఆపరేషన్ చేయించాడు
 
     శివకి కృష్ణ బంధువా?......కాదు  కేవలం పరిచయస్తుడు మాత్రమే, కేవల పరిచయానికే అతను చూపిన త్యాగం మానవత్వం  ఎంతో గొప్పదే కదా అతనికి అతనిలోని మంచితనానికి పరిమళించే మానవత్వానికి హాట్సాప్ చెబుదాం మనందరికీ అతని మానవత్వం మార్గదర్శకం కావాలి.         

Thursday 27 March 2014

జయ ఉగాదీ

                 జయ నామ సంవత్సర శుభాకాంక్షలు
                                   
                                                      విరించి

    శ్రియమున్ గూర్చగ వచ్చెనో జనుల సంక్షేమంబు నే గోరెనో
    పయనంబై తన చెల్లితో దెనుగు సౌభాగ్యంబు పెంచంగనొ
    జయనామంబను వత్సరం బిటకు యే సత్కార్య మాశించియో
    దయతో జేరెను వత్సరాంబ, కడు మోదంబౌను యీ ధాత్రి కిన్
    పల్లవించిన నవ పల్లవంబుల తోడ
                    పాదపముల శోభ పరిడ విల్లె
     విరగ కాసిన ఫల బరువుచే తరువులు
                     ప్రకృతికే అందాల రమ్య తొసగె
     పూప పల్లవముల పొట్టార భుజియింప
                      కలకంటి గాత్రాన కలిమి చేర
      మురిపాన గొంతెత్తి మోహన రాగాన
                      స్వాగతాల్ పల్కె వసంతమునకు
      స్వాగతించుమోయి వత్సరాంగన వచ్చి
      తెలుగు గుమ్మమందు నిలిచి యుండె
      జయము గూర్చ మనకు జయనామమను పేర
      కదలి వచ్చె నదియు కలిమి తోడ. 

    

ఉగాది శుభాకాంక్షలు

                        జయ నామ సంవత్సర శుభా కాంక్షలు
                                                                   విరించి

    శ్రియమున్ గూర్చగ వచ్చెనో జనుల సంక్షేమంబు నే గోరెనో
    పయనంబై తన చెల్లితో దెనుగు సౌభాగ్యంబు పెంచంగనొ
    జయనామంబను వత్సరం బిటకు యే సత్కార్య మాశించియో
    దయతో జేరెను వత్సరాంబ, కడు మోదంబౌను యీ ధాత్రి కిన్

    పల్లవించిన నవ పల్లవంబుల తోడ
                    పాదపముల శోభ పరిడ విల్లె
     విరగ కాసిన ఫల బరువుచే తరువులు
                     ప్రకృతికే అందాల రమ్య తొసగె
     పూప పల్లవముల పొట్టార భుజియింప
                      కలకంటి గాత్రాన కలిమి చేర
      మురిపాన గొంతెత్తి మోహన రాగాన
                      స్వాగతాల్ పల్కె వసంతమునకు
      స్వాగతించుమోయి వత్సరాంగన వచ్చి
      తెలుగు గుమ్మమందు నిలిచి యుండె
      జయము గూర్చ మనకు జయనామమను పేర
      కడలి వచ్చె నదియు కలిమి తోడ. 
    

పాతసీసాలో..........

                                  పాత సీసాలో .....
                                     విరించి

         ఈ కథ చదువుతుంటే అక్కడక్కడ కాస్త పాత వాసన వస్తుంది, కాని ఇది ఆ పాత కథ కాదు, అలా అని చెప్పి ఈ కథ పూర్తి కొత్తది అని చెప్పను.

       మన తరాని కంటే ముందుతరాల నాడే పుట్టిన ఈ కథను ....తరువాత తరాలకు కాలమాన పరిస్థితుల కనుగుణంగా కాస్త పుటం పెట్టి మెరుగులు దిద్ది తెలుగు పాటకుల కందించాలన్న చిన్న ప్రయత్నం ......పాత కథకు కాస్త పొడిగింపు. అంతే...

       రంగయ్య   ఉరఫ్  రంగడు ఓ పేదవాడు,  ఎంత పెదవాదంటే  ఏ సి గదుల్లో కూర్చొని బర్గర్లు పిజ్జాలు తినలేనంత,... ఘుమ ఘుమ లాడే బిర్యానీ పులిహోరాలు తినలేనంత ...వేడి వేడి నీళ్ళతో మైసూర్ శాండల్, పీయర్స్ సబ్బుతో రుద్దుకుని స్నానం చేయలేనంత... శ్రీచందనాది కలపతో తయారు చేసిన పట్టె మంచం పై హంస తూలికా తల్పం వేసుకుని హాయిగా నిదురించ లేనంత,...పట్టు పీతాంబరాలు కట్టుకుని చందనాది లేపనాలని శరీరానికి పూసుకోలేనంత,... ఇమ్పాలా డాడ్జ్ కార్లలో తిరగలేనంత, పేదవాడు.

       దొడ్డుబియ్యం, జోన్నరొట్టే లతో కడుపు నింపుకుంటూ ఇంటి కి దగ్గరలో ఉన్న ఓ చిన్న చెరువులో స్నానం చేస్తూ , అక్కడక్కడ చిరుగులున్న ముతక బట్టలనే అపురూపంగా వేసుకుంటూ ఓ పన్నెండు చదరపు గజాల వైశాల్యంలో ఎండా వానలనుండి రక్షించే స్థాయిలో ఉన్న ఓ చిన్న గుడిసెలో నివసిస్తూ తన జీవితమనే రైలు బండిని మరణమనే గమ్యాన్ని చేరడానికి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న బహు దూరపు బాటసారి రంగడు.

        ఆ రంగాని జీవితమనే రైలు బండిలోకి  పెండ్లి అనే ఒకానొక మజిలీలో ప్రవేశించిన మరో బాటసారి మంగ.

     మంగ, రంగడు భార్యాభర్తలై కలిమికి లోటైనా ప్రేమకు ఏమాత్రం లోటు లేకుండా ఇరుకైన ఆ ఇంట్లో విశాలమైన మనసులతో సంతృప్తిగా జీవించ సాగారు.

       ప్రొద్దున్నే తన పనులన్నీ ముగించుకుని రంగడు ఓ గొడ్డలిని భుజాన వేసుకుని  క్షత్రీయులని   చంప ప్రతిన బూనిన పరశు రాముని వలె  దగ్గరలోని అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి ఊళ్ళల్లో అమ్మి ఇంటికవసరమైన సరకులని తెచ్చేవాడు, రంగనితో బాటు బయలుదేరి ఆ ఊరి మునసబు గారి తోటలో పనికి వెళ్ళేది మంగ, సాయంత్రం వచ్చేపుడు ఆ తోటలోంచి కాసిని మల్లెపూలు కోసుకోచ్చేది,

    రాత్రి ఆ మల్లెలని సిగలో ముడుచుకుని ఇరుకైన ఆ ఇంట్లో చిరిగినా చాపపై వేసిన ఓ ముతక బొంత పై భర్త సరసన చేరి సరసాలతో ఓటమి లేని క్రీడలో క్రీడించి స్వర్గం అంచులదాకా వెళ్లి అలసి స్వేదంతో తడిసిన శరీరాలతో వేడి వేడి నిట్టూర్పులతో హాయిగా నిదురించే వారు.  

       ఒక రోజు ఎప్పట్లాగే గొడ్డలి చేత బూని అడవికి వెళ్లి ఓ చెరువు గట్టు మీద వున్న ఎండిన చెట్టును కొట్టసాగాడు, మిట్ట మధ్యాహ్నం ఎండా తీవ్రగా ఉండడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి, అరచేతులని కూడా వదలలేదు, దానితో గొడ్డలి జారి పోయింది చెరువులో పడిపోయింది.  దిగి గొడ్డలిని తీసుకోవచ్చు కాని తీసుకోలేదు, అలా తీసుకుంటే మన కథ ఇక్కడే ముగిసేది. గొడ్డలి చెరువులో పడిందని ఏడుస్తూ చెరువు గట్టుపై కూర్చుంది పోయాడా అమాయకుడు.

       మనవాడి ఏడుపు విన్న జలదేవతకు  హృదయం కరిగింది, వెంటనే అతని ఎదురుగా ప్రత్యక్షం అయి " రంగయ్యా! ఎందుకేడుస్తున్నావ్?" అని అడిగింది.
  
      రంగడు విషయం చెప్పగానే ఆ దేవత చెరువులో మునిగి తళ తళ లాడే వజ్రపు గొడ్డలితో పైకొచ్చి రంగయ్యకు అందించింది, దాన్ని చూసి రంగయ్య తనది కాదని తిరస్కరించాడు, ఆ తర్వాత మిల మిల లాడే బంగారు గొడ్డలిని అందించ బోయింది, అదీ కాదనడం తో దగద్దగాయ మానంతో ప్రకాశిస్తున్న వెండి గొడ్డలిని తీసుకొచ్చింది, అదికూడా తనకక్కర లేదని తనది కానిది ఏది తాను తీసుకోనని చెప్పడం   తో ఈసారి పాతది తుప్పు పట్టిన ఇనుప గొడ్డలిని తెచ్చింది, దాన్ని చూడగానే సంతోషం తో తీసుకున్నాడు, అతనిలోని నిజాయతికి మెచ్చిన జల దేవత ఆ నాలుగు గొడ్డళ్ళని రంగనికే ఇచ్చి అంతర్ధాన మైంది.

         రంగాని ఆనడానికి అవధులు లేవు వజ్ర బంగారు వెండి ఇనుప గొడ్డళ్ళని   అందుకుని మార్కెట్లోకి పరుగెత్తి అమ్మడం ప్రారంభించాడు, అతనికి బంగారం వెండి ఎక్కడ అమ్మాలో ఎలా అమ్మాలో ఇంతకు అమ్మాలో తెలియదు, చిన్నప్పుడెప్పుడో అంగళ్ళలో రత్నాలు అమ్మినారట ఇచట అన్న పాట విని ఉన్నాడు కనుక అంగట్లోకే వెళ్ళాడు, ఒకడీ అమాయకుని అమాయకత్వాన్ని బాగానే సొమ్ము చేసుకొని ఎంతో కొంత ఇచ్చి నాలుగింటిని హస్తగతం చేసుకున్నాడు.

       ఇంకేం ఆ వచ్చిందే ఎక్కువనుకున్నాడు గుడిసె స్థానం లో మెడ, ముతక బట్టలు పోయి మురిపాల వస్త్రాలు టేకు మంచం యుఫాం బెడ్డు బిపిటి బాస్మతి బియ్యం ఫియర్స్ సబ్బులు ఫేర్ అండ్ లవ్లీ ఫేర్అండ్ హ్యాండ్సం లు వచ్చేసాయ్

     దంపతులు పనుల్లోకి వెళ్ళడం లేదు హానీ మూన్ లే హానీమూన్ లు దేశం లోని అన్ని ప్రాంతాలను చూసొచ్చారు,

     ఇల్లంతా ఏ సి చేయించారు, మల్లెల స్థానంలో కృత్రిమ సెంట్ వచ్చింది               
          
      ఇంతైనా వారి హృదయ వైశాల్యాలు చెక్కు చెదర లేదు.

     ఒకరికి ఒకరి ఇద్దరొకటై జీవిస్తున్నారు.

      ఇంతకు ముందు ప్రతి రాత్రి స్వర్గతీరాలకు వెళ్లి వచ్చేవారు, ఇప్పుడు ప్రతీ రాత్రి స్వర్గాన్ని గదిలోకి తెచ్చుకుంటున్నారు.

      వారి అనురాగంలో మార్పు రాలేదు, ఆప్యాయతలో తేడా రాలేదు ప్రేమ కుదించుకు పోలేదు.ఆనందాల ననుభవించడంలో భేదం రాలేదు.

       మంగ లేనిది రంగడు, రంగడు లేనిదే మంగ ఒక్క క్షణం ఉండేవారు కాదు.

      అందుకే పనులు మానుకున్నారు, శ్రమ సౌఖ్యాన్ని వీడారు, శారీరక సౌఖ్యాల వెంట పరుగు తీసారు.

      గాలిలో ఉంచిన కర్పూరం ఆవిరవక మానదు, కూర్చుని తింటుంటే సిరి కొండంతున్నా కరగక మానదని పెద్దలేనాడో  చెప్పారు, ఇక్కడా అదే జరిగింది, కొన్నాళ్ళకే ఆస్తులు కరిగి పోయాయ్, తిరిగి చిన్నా చితక పనుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది.

        తినే నోరు తిరిగే కాలు ఆగవుగా ..........  కొన్నాళ్ళకు గోదావరి పుష్కరాలు వచ్చాయ్, జనులు తండోప తండాలుగా గోదావరి తీరానికి వెళ్లి స్నానాలు చేసి వస్తున్నారు, ఈ విషయం తెలిసి మన ఆదర్శ దంపతులు సైతం వెళ్లాలని అనుకోని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని డబ్బులు అప్పు తీసుకొని బాసర్ ప్రయాణమయ్యారు. బాసరలో జనసంద్రాన్నే చూసారు.

         అక్కడే ఉన్న పురోహితున్ని మాట్లాడుకుని  జనాలను చేదిస్తూ నదిలోకి దిగి పురోహితుడు మంత్రాలు చదువుతుంటే దంపతులు సరిగంగ స్నానాలు చేయసాగారు, విపరీతమైన రద్దీ ఉండడం వాళ్ళ ఎవరో నెట్టడం తో మంగ నదిలో పడిపోయింది, ప్రవాహం విపరీతమైన వేగంతో ప్రవహించడం తో చాలా వేగంగా కొట్టుకు పోసాగింది మంగ, క్షణ క్షణానికి దూరం పెరగ సాగింది,  అక్కడున్న వాళ్ళు కాపాడడానికి ఎంతో ప్రయత్నించి చాలించుకున్నారు.

       కర్తవ్య మూడుడై కిం కర్తవ్యం అన్నట్లుగా నిలబడిపోయిన రంగనికి భార్య నీటి పాలవడం తో ఏడుపు ముంచుకొచ్చి  బావురు మని ఏడ్చాడు.

       రంగాని ఏడుపు వింటేనే కరిగిపోయే జలదేవత అతని ముందు ప్రత్యక్షమై " ఎందుకొరకు ఏడుస్తున్నావ్ రంగా!" అని ఆప్యాయంగా అడిగి విషయం తెలుసుకుని వెంటనే గోదావరిలో మునిగి రెండు క్షణాలలో అనుష్క లాంటి అందమైన అమ్మాయితో తిరిగి ప్రత్యక్షమైంది , ఇదిగో నీ భార్య అంటూ ఆ అమ్మాయ్ ని ముందుకు నెట్టింది, రంగడు అయోమయంగా కాసేపు చూసి ఆ వెంటనే ఆ అమ్మాయ్ చేయిపట్టుకొని తనవైపు లాక్కున్నాడు.

         ఈసారి అవాక్కవడం దేవత వంతైంది, రంగని చర్యకు కోపంతో ఉడికిపోతూ  " ఇదేంటి రంగయ్యా! ఈవిడ నీ భార్య మంగ కాదుగదా, ఎలా స్వీకరించావ్?.........నీలోని నిజాయతి చచ్చి పోయిందా  లేక నీ భార్య మీద మోజు తగ్గి కొత్త రుచులకోసం కొత్త పెళ్ళాం కావలిసోచ్చిండా?" అని అడిగింది.

        ఆ మాటలకు రంగయ్య  " తల్లీ! నా నిజాయతి చావలేదు నా భార్య పై ప్రేమ తగ్గలేదు, కాని నీవు తెచ్చిన ఈ అమ్మాయ్ నా భార్య కాదూ అన్నానే అనుకో అప్పుడు మరో ఇలియానా లాంటి అమ్మాయ్ ని తేస్తావ్ ఆ తర్వాత సమంత చివరికి గంగను తేస్తావ్ ఆ పిమ్మట నా నిజాతతికి మెచ్చి  ఈ నలుగురిని నాకే అప్పగిస్తావ్, పేదవాన్ని నలుగురు భార్యలని పోషించే శక్తి సామర్థ్యాలు నాకు లేక మొదటమ్మాయ్ తోనే సరిపెట్టుకుందామనుకున్నా!" అంటూ చెబుతున్న రంగని మాటలకు నవ్వుతూ అంతర్దానమై రెండు క్షణాల తర్వాత మంగతో ప్రత్యక్షమైంది జలదేవత.           

  
   

Wednesday 26 March 2014

ఓ మనిషీ మేలుకో

                                                  ఓ మనిషీ మేలుకో                                                         విరించి

అంకురించిన జీవులన్నిటి  గమ్యమొక్కటి తెలుసుకో
రాజు పేదల భేదమెంచక రాలిపోవుటే, మేలుకో!
ఎప్పుడే విధి చావు చేరునో  చెప్పడెవ్వ డీ సత్యమూ
మరణ దేవత నీకు నీడై  వెంట తిరుగును నిత్యమూ,

బుద్భుదంబిది జీవితమ్మని బుద్ధి జీవులు చెప్పినన్
బుద్ధి హీనత చేత మనుజులు భ్రమను వీడక బ్రతుకుచున్
నాది నాదను స్వార్థ చింతన రోజు రోజుకు మించగన్
సాటివారిని దోచుకొనుచు సొంత ఆస్తులు పెంచిచున్

మిద్దెలేమో మెడ లౌతయి మెదలే కద కోటలౌతయి
కన్నవారే భారమౌతరు కాన్తకేమో దాసులౌతరు
కోట్ల కొరకై ప్రాకు లాడుతు కోట మేడల బ్రతుకు కొరకు
కాంచనంబె  సర్వమంటరు  మంచి తనమును అమ్ముకుంటరు

కోట్లు కూడగబెట్టిన  కోటలెన్నో గట్టినా
నీవు చచ్చిన రోజు వెంటనే ఇంటి బయటకి ఈడ్చి వేతురు
మారు బట్టయు నీకు ఇవ్వక మరు భూమి కేమో మొసుకెల్దురు
పెద్ద కర్మ జరిపి పిమ్మట పెదవి విప్పరు నీదు పేరు           

భారతసిపాయి

                                                భారత సిపాయి
                                                     విరించి

త్యాగము చేసినావు కద ధన్యుడ వోయి సిపాయి మాతృ భూ
భాగపు రక్ష సేయ కడు భారపు దీక్ష వహించి నావు నీ
వా గిరి కానలందున నివాసము జేసి విదేశ వేగులా
డేగలబోలు శాత్రువుల డీకొను నీకు జయంబు నిత్యమౌ

భారత భూమి రక్షణపు బాధ్యత చేకొని తల్లిదండ్రులన్
దార సుతాదులన్ విడిచి ధారణి యంచున కొండ కోనలన్
జేరిన త్యాగ మూర్తులు యజేయ పరాక్రమ శీలులౌ మహా
ధీరులు వారి త్యాగధన దీప్తుల కాంతి మహోజ్వలంబులౌ

శ్రీకర భారతావనిని శ్రీగని కానల రత్నగర్భయౌ
సాకరమొప్పు సంస్కృతుల సంచిత శోభల భారతావనిన్
పోకిరి మ్లేచ్చులీ యవని పుణ్య ధరీత్రిని మ్రుచ్చలింపగా
పోకిరి చేష్టలన్ అణచ పోరిది వారి మదంబు ద్రుంచుమా

ఇమ్మహి పాలకుండవయి ఇద్ధరణీ పరి రక్షకుండవై
కమ్మని యమ్మ నీడన సుఖంబుగా లోకులు సేద తీరు యా
కమ్మని వీలునే జనుల కందగ జేసిన వాడ వోయి యే
యమ్మ సుగర్భ వాసమున యంకురా మొందితి వోయి ధీరుడా

ఆరడి పెట్టు దుర్జనుల నంతము చేయగ రుద్రమూర్తి వై
పోరును సల్పు, రక్కసుల పోకిరి మూకల నాశనంబు నే
కోరితి, నుగ్రవాదమును కూకటి వ్రేలుల సంహరించుమా
భారతి కీవు రక్ష జయ భారతి నీకు సదా సురక్ష యౌ

భారము కాదు నీకు భావ బంధములన్ విడనాడి ద్రోహులన్
మారణ కాండ సల్పుదువు మాన్యుడ వైన సిపాయి వోయి సం
హారము జేసి శాత్రు పరిహారము జేయుము సింగమొప్పగన్
తీరదు ణీ ఋణం బెప్పుడు తీర్చగ జాలరు భారతీయులున్                         

Monday 24 March 2014

హాస్యం

                                        హాస్యం                                                విరించి

నవరసాలలోన నాణ్యమై విలసిల్లు
రసము కలదె హాస్య రసము కన్న
రసము లందు హాస్య రసముయే రారాజు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

మంచి నవ్వు యొకటె మనుజుని సర్వంబు
లేమి లోటు కదియు క్షామ కరము
సిరులు లేని వేళ చిరునగవే చాలు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

ఉగ్గుపాల తోడ ఊయలందు శిశువు
కబ్బినట్టి విద్య హాస్య మొకటి
చాట నాటి వరము కాటి వరకె కదా
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

నెయ్యమున్న చోట కయ్యాలు కలగని
మిత్రు డైన మారి శత్రు వవని
హాస్య మెపుడు యప హాస్యంబు కారాదు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

వలచినట్టి కాంత వదనాన చిరు నవ్వు
కాంచనెంచు ప్రియుడు కాంక్ష తోడ,
చెలియ నవ్వు కన్న సిరులు గొప్పవి కావు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

భాష లోని భేద భావంబు పలుకుచు
నత్తి మాటలాడి నరులు ఇలను
హాస్య మొలుకు ననుచు యత్నాలు చేసేరు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మన్నదదియు అక్షయంబిలలోన
నశ్వరంబు లేదు నవ్వుకిలను
తాను శాశ్వతంబు ధన ధాన్యముల కన్న
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

విఫణి వీధులందు విక్రయింపగలేరు
దాన మడగ బోవ ధనము కాదు
ఇలను హాస్యమన్న ఈశ్వర తత్వంబు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

గంతు లేసి యొకడు గమ్మత్తు సేయును
అలవి గాని పనులు హాస్య మనుచు
రోత పనులు సల్ప రుగ్మతే హాస్యమా?
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

పదుగురొక్కసారి పాక పకా యని నవ్వ
పరిసరంబులన్ని పరవశించు
పెళ్లి మండపమున వెళ్లి విరియు నవ్వు
కాంతు లీన జేయు కన్నె యదన

నేత నవ్వు గాంచి దూతలు నవ్వేరు
 తల్లి నవ్వినంత పిల్ల నవ్వు
పెద్ద వారి నగవు పిల్లల మురిపించు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

సరస మేల  చిట్టిమరదళ్ల తో బావ
చిలిపి మాటలేల చేష్ట లేల?
హాస్య రసము యన్న యభిమాన మదికాద,
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

దవడ కండరముల దారుడ్యమును పెంచు
మదిన కుత్సితంబు మట్టు పెట్టు
మనసు శాంత పరచు మందురా నవ్వంటె
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

అపరిచితుల తోడ హాస్య మాడెడువాడు
ఆత్మ బంధువగును అవని జనుల
హాస్య మన్నదొకటె ఆప్యాయతను పెంచు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

కలువ రేకులంటి  కనులు సైతము చూడ
మూసికోనును హాస్య మూల మదియు
హాస్య మిచ్చు సుఖము అంతరాత్మ యె  గాంచు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

నవ్వ లేని వారు నరలోక మందున
ఇమడ లేక మొదట ఇల్లు,పిదప
సతిని వీడి చివర సన్యాసు   లయ్యేరు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

పదుగురున్నచోట పక పక వినిపించు
జ్ఞాని యొక్క డున్న మౌనముగను
వెల్లి విరియు నవ్వు విపుల పుడమి యందు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

దాన మందు యన్న దానంబు మిన్ననీ
అవని జనులు పొగడి యాచరింత్రు
హాస్య మున్న చోట అన్నదానములేల
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

భాషలోన భేద భావాలు యున్నను
తీరు తెన్నులందు తేడయున్న
హాస్య మందు యెట్టి అంతరాలుండవు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

చెలియ నవ్వు గాంచి చెంగలించని వాడు
ఉండబోడు  నిజము యుర్వి యందు
ప్రేమ పంచు నవ్వు కామంబు కాదురా!
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మన్న నేమి? అవహేలనా?  కాదు,
హాస్య మన్న బూతు యసలు కాదు,
హాస్య మన్న యదియు అపురూప యోగంబు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

యోగ సాధనంబు రోగ నాశన కారి
హాస్య మనెడు క్రియయే యవని యందు
హాస్య మొక్కటున్న అవని నే గెలవొచ్చు
హాస్య  మిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మవదు ఎపుడు యవనికి భారంబు
మీదు జనుల కదియు మేలు సేయు
జనుల హృదయ మందు జాగృతౌ హాస్యంబు
  హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము 

భువన విజయ మందు భూరి సాహితి సేవ
జరుపు వేళ యచట జనులు మెచ్చు
కవిత జెప్పు వికట కవిదిరా హాస్యంబు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

స్మిత వదనుని చుట్టు స్నేహితులుండేరు
నవ్వ నాడు కాడు నాయకుండు
నవ్వు వాడి బతుకు నగుబాటు కాదురా
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

తెల్ల దొరల తోడ ధీరుడౌ మన గాంధి
పోరు సల్పి స్వేచ్ఛ  కోరనేల
నవ్వు మరచినట్టి నా జాతి కోసమే
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

సఖియ తోడ ప్రియుడు సరస సంభాషణ
చేయు వేళ యతని చేష్ట లందు
హాస్య ముండు గాని అన్యమెక్కడయుండు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

విశ్వ జనులు మెచ్చు వీరుఁడు మెచ్చును
భిక్షుకుండు మెచ్చు బీద మెచ్చు
సర్వ జగతి మెచ్చు సాధనే హాస్యంబు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

హాస్య మొలుకు చోట ఆనంద   వర్షంబు
కురిసి మురియు నంట కువలయంబు
బాధలన్ని మాపి భాగ్యాల పండించు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

మానవత్వమున్న మనిషిలో సతతంబు
సురులు మెచ్చు హాస్య సుధలు కురియు
మంచి హాస్య మన్న మాధవుండే మెచ్చు
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము 

సిగ్గు పడెడు వేళ చిన్నదానికి నవ్వు
శోభ నిచ్చి యామె షోకు పెంచు
చిత్రమైన యట్టి చిరునవ్వె యందము
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము

కలువ రేకులంటి చిలిపి తనము నిండి 
కాన్తులూరు తుండు కలికి కనులు
తెలుపు భాష హాస్య మలరించు జగతిని
 హాస్యమిచ్చు జనుల కలఘు సుఖము             

          
  
   

    

Sunday 23 March 2014

తేనీరు

                       తేనీరు
                     రచన: విరించి

     సుధార్థులైసురాసురులు  క్షీరాబ్దిని మధించగా
     కామధేను వుద్భవించె కల్పవృక్ష మంకురించె
     ఐరావత మవతరించే  హాలాహలమే పుట్టె
     విష్ణు మూర్తి హృదయమందు  సదా తాను నిలవ దలచి
     పైడి తల్లి యవతరించె  పాలసంద్రముయందునా

     సురాసురుల శ్రమ ఫలితం  ఉద్భవించే స్వర్ణ కలశం
     జగజ్జగాయ మానమౌ  దగద్ధగల కాంతులతో
     తుదకు లభ్యమయ్యెనంట సుధారస భాండమంట
     కాంచనంబగు కలశ మందు  కారు నలుపు రంగు యందు
     కనిపించిన పీయూషం  అది పెంచెను సురుల యశం

     ముడిసరుకని యెంచినారు  తేర్చినారు సుధారసం
     తేరుకొన్న తేట తీసి  తామ్ర పాత్రలోన పోసి
     అమృతమును గైకొనిరి  అదితి సుతులు సురులు వారు
     తేర్చిన  నీరును చూపి  ఎవరికివ్వ వలెనంటు
     చింతించిరి దేవతలు  అసుర జన వంచితులు

     తుదకు బ్రహ్మ యానతితో  నరులకివ్వ దలచినారు
     తెర్చినట్టి నీరు కాన తేనీరైనది లోకాన
     నరుల ప్రీతీ పాత్రమై  ఇంటింటా తా కొలువై
     కులమత భేదమె లేక  వయో భేద మసలు లేక
     భూమండల మందంతను  శక్తి రూపమై నిలిచే
     పీయూష పానులు సురులు  తేనీటి పానులు నరులు
     తత్సమములె నరసురులు  ఆ రమా మానస చోరులు .             

Saturday 22 March 2014

ఫలహార శాల

                                              ఫలహార శాలలు                                                            రచన: విరించి

     క్షుధానల దగ్ద మూర్తుల క్షుత్తు లార్పు చిత్తముతో
     క్షితిజోపరి తలమందున అన్నార్థుల విత్తముతో
     నాటి పలనాటి నాటి చాప కూటి స్పూర్తితో
     వెలసినవీ  హోటళ్లు అల్పా హార లోగిళ్ళు .

 
    జిహ్వ చాపల్యుల కవి శ్వసుర గృహ నివాసాలు
     జాతి సమైక్యత కవి చక్కని తార్కాణాలు
     కులాల కుచ్చితాలు మతాల దారుణాలు
     మచ్చు కైన సోకనట్టి ఉపాహార దుకాణాలు.
   
  అలసి సొలసి దరి చేరిన ఆహూతుల సేద తీర్చి
     ఆకలితో అలమటించు అన్నార్థుల బాధ తీర్చి
     ఇష్ట కామ్యార్థ మెరిగి అందింతురు పేర్చి పేర్చి
     అతిథులనే ఆదరించి  పూజింతురు కొలిచి కొలిచి

   
  ఇనుప గజ్జెల తల్లి ఇష్ట సుతుల కొరకు
     గుడిసె లందు వెలసినవి పేదవారి సేవ కొరకు
     మధ్య తరగతి మానవుడను మన్ననతో సేవించగా
     హై క్లాసు పెరుతోని అవతరించె నవనియందు

     కాసులున్న కామాంధుడి కాంక్ష తీర్చు నెపము తో
     నక్షత్రాలను చూపే నగరాలలోన వెలసె
     అర్థాకలి అర్భకులకు నేత్రానందం సలిపే
     అర్థ నగ్న నృత్యాలతో అలరించే శాలలివే.     

సర్కారు వారీకీ విన్నపం

                                              సర్కారి వారికో విన్నపం                                                                రచన: విరించి
________________________________________________________________

     ఆరోజు ఆదివారం మా ఆఫీస్ కు సెలవు. మా ఆఫీస్ కు సెలవంటే మీ ఆఫీస్ కు సెలవు లేదని కాదు,
అందుకే మా ఆఫీస్ కు సెలవన్నానే కాని మా ఆఫీస్ కు మాత్రమే సెలవన లేదుగా ..... అర్థం చేసుకోండి.
ఈ చిన్న విషయానికే రాద్దాంత మెందుగ్గాని ఆరోజు ఆఫీస్ కు సెలవు కాబట్టి ఆలస్యంగా నిద్ర లేచాను.


     ఆలస్యంగా లేవడం వల్ల కాస్త ఒళ్ళు బద్దకంగా వుంది,  ఉన్నా సరే లేవాల్సిందే కదా!..... అందుకే లేచి, షెల్ఫ్ లోంచి గోల్డ్ ఫ్లేక్ పాకెట్ లోంచి ఓ సిగరెట్ తీసి పెదాల మధ్య పెట్టుకొని  నిప్పంటించుకుని గుండెల నిండా దమ్ము పీల్చుకుని మెల్లిగా పొగ వదులుతూ డ్రాయింగ్ రూం కేసి కదలాను. ఆ రోజు పేపర్ చూడ్డానికి.

     ఎందుకో కిటికీ లోనుండి వీధి వైపు దృష్టి మళ్ళింది, మా ఇంటిముందే కొత్తగా రాత్రికి రాత్రే ఓ పెద్ద
ఫ్లెక్షిని పెట్టినట్టున్నారు .... ఆ ఫ్లెక్షి కనిపించగానే ఏమిటబ్బా విషయమని దృష్టి సారించాను.

     ఆ ఫ్లెక్షి లో పానకాలు నిలువెత్తు ఫోటో ..... అదే మా పనిమనిషి రంగమ్మ మొగుడు పానకాలు ......
లాగే ఓ ఫోటో కనిపించింది.

     పానకాలుకు ఫ్లెక్షిలొ ఫోటో లేయించుకునేంత సీనేం లేదు,మరి ఈ ఫోటో ఎంటబ్బా! అని అనుకునేంత లోనే నేను కళ్ళజోడు పెట్టుకోలేదన్న విషయం గుర్తు కొచ్చింది.

     "జోడు లేక పోవడం వల్ల సరిగా కనిపించక పానకాలు లా కనిపిస్తుందేమో అనుకున్నాను. అంతలోనే చత్వారం తో దృష్టి ఆనక అంతా అలికినట్టుగా కనిపించాలి గాని ఒకరి ఫోటో మరొకరి ఫోటో లా కనిపించ కూడదే, అని కూడా అనుకున్నాను.

     అయినా ఇదో కొత్త రకం జబ్బేమైనా కావచ్చు. ఒకరి ఫోటో ను చూస్తే మరోకరిలా కనిపించే జబ్బు ఏదైనా కొత్త గా  మార్కెట్ లో కోచ్చిందేమో! ఏంటో పాడు కొత్త కొత్త జబ్బులోచ్చేస్తున్నాయ్. ఆదివారం ఏ ఆస్పత్రి ఉంటుందో ఏ ఆస్పత్రి ఉండదో, ఈ కొత్త జబ్బు కెవరు సరైన ట్రీట్మెంట్ ఇస్తారో ....... రేపు ప్రొద్దునే వెళ్లి చెక్ చేయించు కోవాలి" అనుకుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి కళ్ళ జోడు తెచ్చుకుని జోడుతో చూసా  ఆ ఫోటో అచ్చంగా పానకాలుదే.....సందేహం లేదు.

     ఈ పానకాలు గాడికి ఫ్లిక్షిలొ ఫోటో వేసుకునే సీనెలవచ్చిందబ్బా! అసలా ఫ్లెక్షిలొ వాడి   ఫోటో ఎందుకు....      ఆ అవసరం ఎవరికీ ..........అని నాలో నేనే వేయి ప్రశ్నలని వేసుకుని బాధ పడుతుంటే నా మనసు నాకు బుద్ధి చెప్పింది...................." ఏరా ఓరి చదువుకున్న వెధవా! ....ఆ ఫ్లెక్షి లో బంగినపల్లి మామిడి కాయల కంటే పెద్దవైన అచ్చ తెనుగు అక్షరాలు ఉన్నాయ్ చదివితే నీకే తెలుస్తుంది కదరా!" అని హెచ్చరించడం తో నా తొందర పాటుకు నేనే చింతించి ఆ అక్షరాల వైపు చూసాను  ఒక్కో అక్షరం కోనసీమ కొబ్బరి బొండాల కన్నా పెద్దగా ఉన్నాయ్, ఇంకెందుకాలస్యమని చదవడం ఆరంభించాను

     త్యాగశీలి నిస్వార్థ పరుడు పరమ దేశ భక్తుడు పానకాలు గారికి గౌరవ మంత్రి వర్యులు శ్రీ బక్కయ్య గారి చేతుల మీదుగా సన్మానం మరియు త్యాగరత్న, దేశబంధు బిరుదు ప్రధానం  అని రాసుంది.   

     అది చదివిన నా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది," ఈ పానకాలు కేమిటి సన్మానం ఏమిటి ? అసలు నేను మెలకువ గానే ఉన్నానా లేక తెల్లవారు జామున నిద్రలో కలగంటున్నానా?" అని నాకు నేనే గిచ్చు కున్నాను.  నెప్పిగా వుంది.

      కలలో గిచ్చుకున్నా నెప్పిగా ఉంటుంది గామాలు అనుకొని నా సందేహాన్ని తీర్చుకోవాలన్నా పట్టుదలతో నా శ్రీమతిని కేకేసాను.

     "ఏమిటోయ్! ఓ సారిలా వస్తావా?......."అని పిలిచా

     " ఎన్టీ ప్రొద్దునే ఆ కేకలు!" అంటూ లోపల్నుండే విసుక్కుంది. సాయంత్రమైతే కేకలు వేయడానికి పర్మిషన్   ఉన్నట్టు.

      " రావోయ్ తొందరగా ఇక్కడో తమాషా చూపిస్తా"...... అన్నాను ఆలస్యాన్ని భరించలేక.

     వంటింట్లో చేస్తున్న పనిని వదిలేసి గొణుగుతూ వచ్చింది,చాలా తీవ్రంగా పనిచేస్తున్నట్టుంది చీర తడవ కుండా ఉండాలని  కుచ్చిళ్ళని అరగజం పైకి ఎత్తి  బొడ్డులో దోపుకోవడం వల్ల కుడికాలు మోకాలు కంటే నాలుగంగుళాల పై వరకు పచ్చని పసిమి రంగు పిక్కలు  గుండ్రటి అందమైన మోకాలు బంతి  ఆ నునుపు కనిపించి నన్ను ఊరిస్తుంటే కళ్ళప్ప గించుకుని ఆ కాలి అందాలనే చూడసాగాను.

     నా చూపులెక్కడున్నాయో గమనించి తన కుచ్చిళ్ళను సరిచేసుకుంటూ, ముసి ముసి గా నవ్వుతు "ఇందుకేనా పిలిచింది" అంది. ఆ  కంటం లో కావాలని తెచ్చి పెట్టుకున్న కోపాన్ని ప్రదర్శించింది.

    " ఆ.... అవును మరి..... ఎప్పుడు నిన్ను  చూడలేదని ఇలా పిలిచి నీ అందాలను జుర్రు కుందామని ఇంతోటి అందాల సుందరి ఏడేడు లోకాలలో లేదని .  ఎప్పుడు నాతో నీ అందాల స్తోత్రం జరిపించు  కుందామని ఎంత కోరికరా నీకు" అంటూ ఆట పట్టించి   " ఇలా రా ! అక్కడ ఏముందో చూడు." అన్నాను.

     నేను ప్రత్యేకంగా పిలిచి చూపించాల్సినంత విశేషం ఏమిటా అని కిటికీ దగ్గరికొచ్చి నాకంటే ముందు నిలబడి వీధి వైపు చూడ సాగింది.

     వీధిలోకైతే చూస్తుంది కాని ఎం చూడాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తున్నా ఏమి కనిపించ క పోయేసరికి     "ఎక్కడండీ...." అని అడిగింది.

       ఆమెకు చూపాలని కాస్త దగ్గరికి జరిగా నా ఎడం చేయిని ఆమె భుజం పై వేసా నా వేడి నిశ్వాసం ఆమె మందారాల్లాంటి బుగ్గలని స్పృ షిస్తుంది. నా వక్షస్థలం ఆమె వీపుకి తగులు తుంది. ఆ స్పర్శ లోని మాధుర్యాన్ని గ్రోలుతూ నేను చూపిన ఫ్లెక్షిని చూసింది.

     "ఓస్..... ఇంతేనా వాడెవడో  పానకాలు వాడికి సన్మానం ఆ సన్మానమేదో  మీకే జరుగుతున్నట్టు దీనికింత హడావిడా....?లోపల నా పనంత పాడు చేసారు" అంటూ వెనక్కు తిరిగింది .

     అలా తిరగడం తో ఆమె స్తనద్వయం నా వక్ష స్థలాన్ని డీ కొట్టడం తో అసంకల్పిత ప్రతీకార చర్యలా నా చేతులు రెండూ ఆమెని చుట్టేసాయి.

     ఆమె అలాగే నా కౌగిట్లో ఒదిగి పోతూ   " రాత్రి చేసిన చిలిపి పనులు చాలలేదా!..... మళ్ళీ ప్రొద్దున్నే తయారయారు, ముఖం లేదు స్నానం లేదు, వెళ్ళండి ముందు స్నానం చేసిరండి," తీయగా కసిరింది నా కౌగిట్లో కరిగి పోతూనే.

      "స్నానానికి ముందే సరసాలాడాలోయ్, తర్వాత ఇద్దరం కలిసి ఏకంగా సరిగంగ  స్నానాలాడదాం.."అంటూ ఆమె పెదాలను నా పెదాలతో అందుకో బోయాను .

     " ఊ చాలు చాలా స్పీడై పోయారు, పిల్లలు ఎవరో ఫ్రెండ్స్ వస్తే ఇప్పుడే వస్తామని వెళ్ళారు ఏక్షణాన్నైనా రావచ్చు,....... లోపల రంగమ్ముంది." నా చేతులని తప్పిస్తూ అంది.

     రంగమ్మ  పేరు చెప్పగానే నాకు ఫ్లెక్షి గుర్తు కొచ్చింది.

      "ఆ ఫ్లెక్షి లో ఉన్న పానకాలు ఎవరో తెలుసా..........?" అడిగాను.

       తెలియడానికి అతనేమైన సి యమా,  పియమా  అంటూ నాకు ఇంకాస్త దగ్గరగా జరిగి నా  పెదాల పై ముద్దు పెట్టుకుంది.

       తీయనైన ఆమె లేత తమలపాకుల్లాంటి యెర్రని పెదిమల స్పర్శ ని , ఆమె అధరామృతపు కమ్మ దనాన్ని ఆస్వాదిస్తూ   ఓ నిమిషం పాటు కళ్ళు మూసుకుని ఉండిపోయాను. తర్వాత ఈ లోకానికోచ్చి  " "అతనేం సియం కాదు పియం కాదు కానీ మన రంగమ్మ మొగుడు" అన్నాను.

     ఆ మాటకు ఉలిక్కి పడడం ఈసారి ఆమె వంతైంది.     "రంగమ్మ మొగుడా !?,,,,,, ఏ రాచ కార్యం వేలగాబెట్టాడని ఈ సన్మానం." అడిగింది నన్నే.

       "అదేనోయ్ వాదికేండుకీ సన్మానం! సంసారానికి కూడా అక్కరకు రాని అర్ధాణా కు విలువ లేని వాడికేందుకీ సన్మానం........?"అని ఇంకా ఏమో అన బోయెంతలోనే ఆమె నన్ను అనుమానంగా చూస్తూ

        "ఏంటీ! వాడు సంసారానికి పనికిరాడా?.... మరి రంగంమకి నలుగురు కొడుకులు .... ఈ విషయం అంటే వాడు అర్ధాణా కు కొరగాని విషయం    మీకు తెలుసు, అంటే మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు   అదే నంది మన చిన్నాడు పొట్టలో ఉన్నప్పుడు నేను పురుడికి వెళ్ళినప్పుడు రంగమ్మ వంట కోసమని మధ్యాహ్నాలు వచ్చిన విషయం నిజమే నాన్న మాట." అంది ముక్కు ఎగ బీలుస్తూ.

       ''అయితే ఏమిటోయ్ నీ ప్రాబ్లం" అడిగాను.

        "చేసేవన్నీ చేసి నంగనాచి తుంగ బుర్రలా నటించకండి, ఆమె పెద్ద కొడుక్కన్నీ మీ పోలికలే నాకిప్పుడు అర్థమవుతుంది, మీరు సామాన్యులు కారు". అంది.

         అప్పుడు ఆమె మాటలకర్థం తెలిసి షాక్ అయ్యాను, ఛి ఛీ అవేం మాటలు, వాడు సంసారానికి అక్కర రాడన్నానే కాని పనికి రాదనలేదే పిచ్చి మొద్దు,
        వాడు సంపాయించిన ప్రతీ పైసా వాడి తాగుడుకే ఖర్చు పెట్టుకుంటాడు కాని ఇంటి ఖర్చులకు ఒక్క పైసా ఇవ్వడాన్న ఉద్దేశం లో అన్నానే.
         అయినా జగదేక సుందరి లాంటి భార్యవు నువ్వుండగా నాకు వేరే వారెందుకోయ్,  నువ్ నాకు ఏం తక్కువ చేస్తున్నావని అడ్డ దార్లు తొక్కుతాను చెప్పు, కొందరు భార్యలకు  భర్తలను సుఖపెట్టడం తెలియదు. శృంగారం అంటేనే ఒక పాప కార్యమని శృంగారం లో పాల్గొన్న తర్వాత దేనిని తాకొద్దని మైల పడ్డామని భావిస్తారు ఒకవేళ గత్యంతరం లేక   శృంగారం లో పాల్గోనాల్సొస్తే ముందే నీళ్ళు వేడి చేసి బాత్ రూం లో పెట్టుకుని శృంగారం లో పాల్గొంటారు, పని పూర్తి   కాగానే వెంటనే  స్నానాలు చెయ్యాల్సిందే.
 
        ఈ  మూర్ఖత్వం తో శృంగారాన్ని మొక్కుబడి కార్యం గా భావించే భార్యల  భర్తలకు తన భార్యతో శృంగారాన్ని ఇష్ట పడరు అలాంటి భర్తలు బయటి సంబంధాలకొరకు ఆరాట పడతారు. అది ఆ భర్తల పొరపాటు కనే కాదు పూర్తిగా అలాంటి భార్యలదె తప్పవుతుంది.
  
          అలాంటి భార్యలు  భార్యలు భయ పడాలి తన భర్త కు ఎవరి తోనైనా అక్రమ సంబందాలున్నా యేమో  నని, కొందరు ఎప్పుడూ ఏదో ఒక వంక తో మూలుగుతూ ముక్కుతూ ఉంటారు అలాంటి వాళ్ళ మొగుళ్ళకి అవసరం వేరే సంబంధాలు. ఇంకా చెప్పాలంటే చీటికి మాటికి మొగుళ్ళని అనుమానించి విసిగించే భార్యల మొగుళ్ళకు తప్పదు అక్రమ సంబంధాలు , నీలాంటి రతీ దేవివి వుండగా వేరే వారు నాకేందుకోయ్." అని చెప్పి నమ్మించేసరికి ణా తల ప్రాణమ్ తోక కోచ్చినంత పనైంది.

    పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది నా శ్రీమతి. తుఫాను వేలిసినట్టుగా ఫీలయ్యాను

     లోపల పనులన్నీ పూర్తి చేసుకుని చీపురు తో గది ఊదవ దానికి వచ్చింది రంగమ్మ, అలా వంగి ఊడుస్తుంటే ఆమె పైట కొంగు స్థాన భ్రంశం చెంది జాకెట్ లోనుండి హైబ్రీడ్ బొప్పాయి కాయల్లాంటి పాలిండ్లు ముప్పాతిక భాగం దర్శన మిచ్చాయ్

       అంత వరకు రంగామ్మనిలాంటి దృష్టితో చూడలేదు కాని ఈరోజు నా భార్య మాటల ప్రభావం కావచ్చు ఎంత వద్దనుకున్నా నా కళ్ళు ఆమె పూర్ణ కలశాల్లాంటి వక్షోజాలనే చూడసాగాయ్,

          మనసు కోతి లాంటిది కదా!

     రంగమ్మ కాస్త నలుపైనా పర్సనాలిటి ఎంతో సెక్షీగా వుంది ఎక్కడ ఎంతెంత ఎత్తులుం    డాలో ఎక్కడెక్కడ ఎంత వంపులుండాలో అంతే ఉండి ఎదుటి వారి గుండెల్లో గుబులు రేపెలా వుంటుంది .ఒక పరాయ్ ఆడదాన్ని ఆ దృష్టితో చూద్దాం ఇదే మొదటి సారి. ఇదే ఆఖరి సారి కూడా కావాలి మరి లేదా బంగారం లాంటి సంసారం లో చిచ్చు రేగుతుంది

         ఈ ఆలోచనలకు  ఇక్కడితో  ఫుల్ స్టాప్   పెట్టేసి సాయంత్రం పానకాలు సన్మాన సభకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నా, మాతో పాటే రంగమ్మను తీసుకెళ్తానని చెప్పగానే ఆమె ఎంతో సంబర పడింది .
                              
********  *******    ********          ***********          **********      ***********    ***********      మునిసిపాలిటి వాళ్ళ ఒక చిన్నపాటి పెద్ద ఆడిటోరియం జనాలతో క్రిక్కిరిసి ఉంది. ఆ జనాలను చూసి నేనే ఆశ్చర్య పోయాను ఈ పానకాలుకు ఇంతటి ఫాలోయింగా అని, తర్వాత ఎవరో అనుకొనగా తెలిసింది వాళ్ళంతా ఊరికే రాలేదని ఒక్కొక్కరికి   రెండేసి వందల రూపాయలు మూడేసి సారా పాకెట్లు ఇస్తామని చెప్పి తీసుకోచ్చారట. ఏ ప్రతిఫలం ఆశించ కుండ వచ్చింది మా కుటుంబం మరియు రంగమ్మ మాత్రమే.

    అనుకున్న సమయానికి అరగంట లేటుగా వచ్చారు అమాత్య వర్యులు, అతన్ని చూడగానే మన ప్రభుత్వాలు ఎంత లేదని చెబుతున్నా ఆహార కొరత తీవ్రంగానే ఉండి తీరుతుందన్నది నా స్థిర మైన అభిప్రాయం.

    ఐదున్నర అడుగుల ఎత్తు సుమారు పదమూడడుగుల చుట్టు కొలతతో  సర్కస్ లోంచి పారిపొయొచ్చిన గున్న ఏనుగులా ఉన్నాడు, రాష్ట్రం లో ఉత్పత్తి ఐన మొత్తం ఆహారమైనా అతనికే చాలేలా లేదు ఇక జనాల కెక్కడిది. అందుకే మనకు ఆహార కొరత తప్పదు.

      మంత్రి గారు వచ్చీ రావడం తోనే తనకు వేరే ప్రోగ్రాం లున్నాయని వెంటనే వెళ్లాలని చెప్పడం తో కార్యక్రమం హడావిడిగా ప్రారంభమైంది.

       స్టేజి పై ఓ ప్లాస్టిక్ కుర్చీ వేసి పానకాలును కూర్చోబెట్టారు, మంత్రి గారు చేతిలోకి మైకు తీసుకొని, తమ ప్రభుత్వం చేసామని భావిస్తున్న చేయని పనుల గురించి  చేయడానికి సాధ్య పడని చేయబోయే పనుల గురించి ఊహలకే అందని సరికొత్త ప్రణాళికల గురించి ఓ పది నిమిషాలు కామాలు ఫుల్ స్టాపు లు లేకుండా చెబుతుంటే నేనాశ్చర్య పోయాను

    వీళ్ళింతలా చేస్తుంటే ఇంకా మన రాష్ట్రం లో ఈ పేదరిక మెట్లున్నది, రైతుల నేత కార్మికుల ఆత్మ హత్యలు ఆగడం లేదెందుకు. ఈ విషయాలు అర్థం కాక తల పట్టుకున్నాను.

     ఇక సన్మానం ఆరంభమైంది,

     ఇంకా ఈ సన్మానం ఈ పానకాలుకు ఎందుకు చేస్తున్నారో మాత్రం అర్థం కాలేదు.

     ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన ఓ బంతిపూల దండను పానకాలు మేడలో వేసి,నూటాముప్పై కి కొనుక్కొచ్చిన ముదురు ఆకుపచ్చ శాలువాను కప్పి పది బై పన్నెండు సైజ్ లో ఉన్న మేమేంటోను  చేతిలో పెట్టి అందరిని చప్పట్లు కొట్టమని మైకులో చెప్పారు.

      హాలంతా చప్పట్లతో మారు మ్రోగి పోయింది.

      తన పని పూర్తి చేసుకొని మంత్రిగారు వెళ్ళిపోయారు.

      ఇప్పుడు మైకు ఓ లోకల్ లీడర్ చేతిలోకి పోయింది,   

    అతనో దగ్గు దగ్గి మైకును వ్రేలుతో ఓసారి కొట్టి ఇలా చెప్పడం ఆరంభించాడు  "ఈ రోజు ప్రముఖ త్యాగ మూర్తి, నిస్వార్థ పరుడు అచంచల దేశ భక్తుడు మాననీయ పానకాలు ను సన్మానించు కోవడం మన అదృష్టంగా భావిస్తాను" అని చెప్పాడు.

     "ఈ సన్మానాలు అగ్రవర్ణాల వారికి కార్పోరేట్ వ్యాపారులకే ఇంతవరకు పరిమితమై ఉండేవి, కాని ఈరోజు ఓ దళిత వెనుక బడిన వర్గాలకు చెందినా సామాన్యులకు కూడా అందుబాటులోకి తేవాలని దాని ద్వారా సామాజిక న్యాయం అందజేయాలని మా ప్రభుత్వం నిర్ణయించడం మీ అందరి విజయం. అందులోని భాగంగా ఓ సామాన్యున్ని ఎందుకూ పనికి రాని వాడిన ఈ పానకాలును సన్మానిస్తున్నాం."

    అతనలా చెబుతుంటే నాకతను పానకాలును పొగడు తున్నాడా తెగడు తున్నాడా అర్థం కాలేదు.

         తిరిగి ప్రారంభించాడు " పానకాలు ప్రభుత్వోద్యోగా కాదు కంట్రాక్టరా  కాదు అంటే అతను సర్కారు నుండి ఒక్క పైసా తీసుకోవట్లేదు పైగా ప్రభుత్వ ఆదాయానికి అతని సహకారం ఎంతో ఉంది.

   రాష్ట్రాదాయం లో సింహ భాగం మద్యపానం నుండే వస్తుంది కదా అందుకే జిల్లాల వారిగా ఎవరైతే ఎక్కువ మద్యపానం సేవిస్తారో వారిని సన్మానించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ జిల్లాలో మన పానకాలు ఎన్నికయ్యాడు.

   ప్రభుత్వోద్యోగులు జీతాల కొరకు  సమ్మె చేస్తారు సర్కారు సొమ్ముకు ఆశ పడతారు, కాని పానకాలు సమ్మె చేయదు సర్కార్ పైసాకు ఆశ పడడు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక రాష్ట్ర ఖజానా పెంచుతున్నాడు". అని చెప్పి చివరగా పానకాలు ని సందేశం ఇవ్వవలసినదిగా ఆహ్వానించాడు.

    పానకాలు లేచాడు మైకు ముందుకొచ్చి

       "అయ్యలారా! దండాలు, నేను బాగా తాగుతానని బందు చేయమని నా భార్య ఎంత సతాయించినా వినను  ఎందుకు వినాలి? ప్రభుత్వం సారా దుకాణం పెట్టింది ఎందుకు మనం తాగాలనే కదా! ..........
సర్కారు దవఖానాలు కావాలి వాళ్ళు పెట్టిన రేషన్ షాప్ లు కావాలి వాళ్ళ స్కూల్ లు కావాలి కానీ వాళ్ళ సారా దుకాణాలు వద్దా ఇదెక్కడి న్యాయం. అందుకే తాగుతున్నా.

         మేం తాగితేనే సర్కారుకు పైసలొస్తయ్ వాళ్లకు పైసలోస్తేనే నౌకర్ దార్ లకు జీతాలిస్తారు, అంటే కలెక్టర్ కాడికెల్లి కండాక్టర్ దాక మనమిచ్చే పైసల తోని బతుకు తున్నరు, మనమ తాగుడు మానుకుంటే వాళ్ళ పెండ్లాం పిల్లలెట్ల  బతుకుతరు.

     ఇగ మన ఆడోల్లు తాగొద్దు తాగొద్దు అనున్నారు, రాత్రి తాగి ఇంటికి పోతే   మన నోర్లు వాసనొస్తున్నాయని మన భార్యలు మన పక్కకు కూడా రావట్లేదు, మీద చెయ్యి వేయనీయట్లేదు, ఎంతైనా ఉప్పు కారం తినేటోల్లం కదా కూడెట్లనో మనిషికి గా సుకం కూడా కావాలె కనుక సర్కారోల్లు  ప్రతి ఊర్ల గీ సారా దుకాణం పెట్టినట్లే  సాని దుకాణం పెట్టాలి.

    మా భార్యలు దగ్గరికి రానీయకుంటే  ఆడికి పోయన్న సుక పడతం గట్ల మీకు కూడా పైసలు  ఎక్కువగానే వస్తయ్

    రోగాలోస్తాయని భయ పెడుతున్నారు, వస్తే ఏమైతది   ఆరోగ్య శ్రీ  ఉండనే ఉండే.

     మేం ఖుషీ చెయ్యాలే సర్కారుకు పైసల్ రావాలే గంతే " అని చెబుతుంటే నేను నోరెళ్ళ బెట్టాను .     

 
    

Friday 21 March 2014

పలుకులమ్మ పదాలు

                                             పలుకులమ్మ పదాలు                                                             రచన: విరించి

          చదువు నిచ్చెడు వాణి
          జనము కిచ్చును వాణి
          అభయమిచ్చెదు పాణి
          ఓ పలుకులమ్మ

      
                                                                   తెలుగు పలుకు ఘనము
                                                                         తెలుసుకోరట జనము
                                                                         ఆంగ్ల మయ్యెను ధనము
                                                                         ఓ పలుకులమ్మ

    
       జగతి యందున కొమ్మ
           పురుష జాతికి బొమ్మ
           జాతి కంతకు అమ్మ
           ఓ పలుకులమ్మ

                                                                       చిన్న తనమున బడియు
                                                                       యవ్వనంబున ఒడియు
                                                                       ముసలివానికి గుడియు
                                                                       ఓ పలుకులమ్మ
            రావణుండే భోగి
            కుంభ కర్ణుడు రోగి
            లక్ష్మణుండే త్యాగి
            ఓ పలుకులమ్మ

                                                                        మానవత్వము మరచి
                                                                        కులము పేరిట విరిచి
                                                                        పొంద జూసిరి కురిచి
                                                                        ఓ పలుకులమ్మ

          
మల్లె తీగని నాడు               
           పెళ్లి యాడెను వాడు
           మర్రి మ్రానే నేడు
           ఓ పలుకులమ్మ
                                                                              చిగురు మావిడి తోట
                                                                              కోకిలమ్మల పాట
                                                                              పల్లెటూళ్ళకు కోట
                                                                              ఓ పలుకులమ్మ


           నీతి తప్పిన నాతి
           కానలోదిలిన కోతి
           జాతి కెంత యొ భీతి
           ఓ పలుకులమ్మ


                                                                                      తల్లిదండ్రులు ఓల్డు
                                                                                      పడచు భార్యయే గోల్డు
                                                                                      మానవత్వమే బోల్డు
                                                                                      ఓ పలుకులమ్మ


            నేతలిచ్చెడి నోటు
           కోరి చేసిన ఓటు
           దేశ భవితకు చేటు
           ఓ పలుకులమ్మ

                                                                                       ఇంట ఉంటెను తల్లి
                                                                                       భార్య ఐతెను నల్లి
                                                                                       ముడురుతుందట లొల్లి
                                                                                       ఓ పలుకులమ్మ


           తాను కట్టిన ఇంట
           కన్నా కొడుకుల వెంట
           ఉంట నంటే తంట
           ఓ పలుకులమ్మ

                                                                                       తాను చేసిన అప్పు
                                                                                       రాగులు చుండిన నిప్పు 
                                                                                       తప్పదిన్కను ముప్పు 
                                                                                      ఓ పలుకులమ్మ


           మొగుడు తెచ్చిన చీర
           మెచ్చ నంటాది దార
           చౌక రాకమను పేర
            ఓ పలుకులమ్మ


                                                                                             మంత్రి దోచెను కొంత
                                                                                              కమిటి వేసిరి అంత
                                                                                               వారు దోచిన దెంత
                                                                                               ఓ పలుకులమ్మ


                                                 బావ కొచ్చిన తిక్క
                                                 దిగులు పడదట అక్క
                                                  అమ్మనాన్నకు బొక్క
                                                   ఓ పలుకులమ్మ


                                                    వయసు నాడే చాన
                                                    కులుకు నేర్చిన జాన
                                                    ఇప్పుదయ్యేను బాన
                                                    ఓ పలుకులమ్మ


                                                     చదమంటే బోరు
                                                     చూసి రాతల జోరు
                                                     చూడ మార్కుల హోరు
                                                     ఓ పలుకులమ్మ

                                                     వంపు సొంపుల జూపు
                                                     దేహమంత్ను ఊపు
                                                     నేటి సిన్మల నాపు
                                                     ఓ పలుకులమ్మ


                                                     ఒక్కడైతే ముద్దు
                                                     ఇద్దరేమో హద్దు
                                                     మూడు ఇంకను వద్దు
                                                      ఓ పలుకులమ్మ


                                                      నారు పోసిన వాడు
                                                      నీరు పోయక పోడు
                                                      అన్న మాటల వీడు 
                                                      ఓ పలుకులమ్మ


                                                      పాత దైనది క్లబ్బు
                                                      కొత్త గోచ్చెను పబ్బు
                                                      యువత కొచ్చిన జబ్బు 
                                                      ఓ పలుకులమ్మ


                                                       కత్తి రించిరి హేరు
                                                       రంగులద్దిరి నోరు
                                                       శోకులోచ్చెను జోరు
                                                       ఓ పలుకులమ్మ

 
     


        

Wednesday 19 March 2014

చిత్తు కాగీతం

                                                చిత్తు కాగితం
                                                   రచన: విరించి
-------------------------------------------------------------------------------------------------------------
        వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహ బందురం సిందు రాననం అంగం హరే   పులకభూషణ మాశ్రయంతీ భ్రుంగాంగనేవ....... ..... .......    
       మా ఆవిడ గళం లోంచి కనకధార స్తోత్రం ఎంతో శ్రావ్యంగా వినిపిస్తుంది.

     ప్రతి రోజు  ఉదయం కనకధార స్తోత్రం  ఆ తర్వాత రామరక్షాస్తోత్రం అటు పిమ్మట శ్రీ లక్ష్మీఅష్టకం  ఇలా ఫుల్ స్టాప్ లేకుండా పారాయణం చేస్తూ పనులన్నీ చక చకా చేసుకోవడం ఆమె అలవాటు.

     ముందు గదిలో పడక్కుర్చీలో కూర్చొని మా ఆవిడ గాత్ర మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పేపర్ చదూకోడం నా అలవాటు. ఇది కొత్తదేం కాదు మా పెండ్లైన నాటి నుండి వస్తున్నదే.

      ఈరోజు పారాయణం చేస్తూ పూలు కోస్తున్న మా వరలక్ష్మి మధుర గాత్రం మధ్యలో టక్కున ఆగడంతో నేను డిస్ట్రబ్ అయినట్టుగా ఫీలై పేపర్ లోంచి తలెత్తి గేటు వైపు చూసాను.

       మా ఆవిడ పారాయణం మధ్యలో ఆపిందీ అంటే ఏదో ఉపద్రవం ముంచు కొస్తుందన్న మాటే.

     నా సిక్స్త్ సెన్స్ బ్యాడ్ సిగ్నల్ ఇవ్వ సాగింది.

      క్యోశ్చన్ మార్క్ ముఖం వేసుకొని గేటు వైపు చూడసాగాను .    

      "ఏమండీ! అన్నయ్య పోయాట్ట " ఒక చేత్తో పూలబుట్ట పట్టుకొని పరుగేత్తినట్టుగా   వస్తూ నన్ను చూడగానే అరిచినంత పనిచేసింది.

       ఏ......ఏ......ఏమిటి !?...ఆమె చెబుతున్న ఆ అన్నయ్య ఎవరో అర్థం కాక అడిగాను.

       "విశ్వమన్నయ్యటండీ!......రాత్రి పోయాట్ట, సీతారాం గారు ఇప్పుడే కబురంపారు" చెబుతున్న ఆమె కంటం లో వణుకు స్పష్టంగా తెలుస్తుంది.

        ఆ వార్తని నా మెదడు రిసీవ్ చేసుకోడానికి పది క్షణాలు పట్టింది.

        అది పిడుగు పాటులా నా హృదయాన్ని తాకింది.

      గుండె బరువెక్కింది, చేతుల్లోని పేపర్ జారిపోయింది. ఆవార్తని నమ్మలేక పోతున్నాను.

      "నిన్న రాత్రే కదుటండి మనింటికొచ్చి దాదాపు రెండు గంటల పైగా కూర్చొని వెళ్ళాడు, అంతలోనే ఏమై ఉండొచ్చండి" తిరిగి నన్నే అడిగింది.

     ఆమె ప్రశ్నకు జవాబిచ్చే స్థితిలో నేను లేను  బాధగా ఓ నిట్టూర్పు వదులుతూ

     "ఈ రోజుతో వాడు అవమానాల నుండి కష్టాలనుండి విముక్తి పొందాడు," నాలో నేనే అనుకున్నాను.

     "పదండి వెళదాం చివరిచూపైనా దక్కుతుంది".... అని "ఉండండి అబ్బాయికి కోడలుకి చెప్పొస్తా"

అంటూ లోనికి వెళ్ళింది

      నేనలాగే శూన్యం లోకి చూస్తూ నిస్తేజంగా కూర్చుండి పోయాను.

     ఓ ఐదు నిమిషాలలో లోపలి నుండి వస్తూ "పదండీ! ఇంకా అలాగే కూర్చున్నారేం, తెమలండీ!" అంటూ తొందర పెట్టింది.

     "నేను రాలేను వరం, శవంగా వాణ్ని చూసి తట్టుకోలేను" ఎంతో బాధగా అన్నాను. నా గొంతు లోని జీరను గమనించి నా బాధనర్థం చేసుకుని నా దగ్గరకొచ్చి నా భుజం పై చేయి వేసి

      "ఎం చేయగలం చెప్పండి? ప్రతీ వాళ్ళం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వాళ్ళమే! ఒకరు ముందు ఒకరు వెనుక అంతే! మనమే ఇంతలా బాధ పడుతున్నాం ఇక భార్యా పిల్లలెంతలా బాధ పడుతున్నారో పాపం! త్వరగా వెళ్దాం పదండి" మరీ మరీ తొందర చేయ సాగింది.

        ఆమె మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు

    ఆ ఇంట్లో వాడికోసం ఏడ్చే వాల్లెవరున్నారని అందామను కున్నాను కాని అనలేక పోయాను.

       "సరే పద !" అంటూ కుర్చీ హండిల్ పై ఉన్న ఉత్తరీయాన్ని భుజం పై వేసుకొని బయటకొచ్చాను  నా వెనుకే వరం.

      ఇంటిముందే ఆటో ఉండడం తో మౌనంగా దాంట్లో కూర్చున్నాం.

     ఒక్క జర్క్ తో ఆటో ముందుకు కదిలింది, నా ఆలోచనలు  వెనక్కి  పరుగెత్త సాగాయ్

       విశ్వం తో నాకున్న అనుబంధాన్ని నెమరు వేసుకోసాగాను.

      నిన్న రాత్రి ఇంటికొచ్చి  రెండు గంటలు పిచ్చాపాటి మాట్లాడుతూ మాటల మధ్యలో వాడు   "ఒరేయ్ దశరథం .......కాశి వెళ్ళాలని ఉందిరా చేతలో చిల్లి గవ్వ లేదు, ఓ ఐదు వేలు సరదా గలవా!? అని అడిగాడు, అలా అడగడానికి ఎంత మొహమాట పడ్డాడో వాడి కళ్ళే చెప్పాయి.

     ఏనాడు ఎవరినీ ఎలాంటి సాయాన్ని అర్థించని వాడు ఈ రోజిలా అడగాల్సోస్తున్నందుకు బాధ పడుతున్నాడని గ్రహించి  టేకిట్ ఈజీ అన్నట్టుగా వాడి తోడ పై చేయి వేసి

    "నువ్వూ సుభద్రా వెలుతున్నారా!? ఐదు వేలెం సరిపోతాయిరా పది ఉండని" అన్నాను

    నా మాటలకు వాడదోలా నవ్వి  " ఆవిడ గారిప్పుడు కొడుకులు కోడలు మనవలూ అన్నలూ వదినలూ అందరితో బిజీ కదా వీళ్ళందరినొదిలి ఆవిడ గారు రారులే, నేనొక్కన్నే వెళ్తాను." అని చెప్పి కొద్దిగా తటపటాయిస్తూ స్వరం తగ్గించి  "ఈ డబ్బుల్ని మల్లి తిరిగి ఎప్పుడిస్తానో, అసలు ఇస్తానో లేదో నీ ఋణం లో పడిపోతానేమో రా" అన్నాడు వాడి కళ్ళల్లో నీళ్ళు,

    ఇన్నాళ్ళ మా స్నేహం లో వాడి కళ్ళల్లో తడిని నిన్ననే చూసి చలించి పోయా.

     ఆప్యాయంగా వాడి భుజం పై చేయివేసి " నీ కంటే నాకు వేరే ఆత్మీయులెవర్రా! నీ కోసం నేనీ చిన్న సాయాన్ని కూడా చేయకూడదా! ఈ చిన్న విషయానికి ఋణాలు అంటూ అంతంత పెద్ద మాట లెందుకురా!? సరే గాని డబ్బులు ఎప్పుడిమ్మంటావ్" అని అడిగాను .

      " రేపుదయాన తీసుకొని టిక్కట్ రిజర్వ్ చేసుకుంటాను టిక్కెట్ ను బట్టి నా ప్రయాణం రా"   అని రాత్రి విశ్వం నాతో అన్న మాటలు ఇంకా నా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉన్నాయ్.

      ఏనాడు తనకై ఇది కావాలని అడగని వాడు, అడక్క అడక్క ఒకేఒక సాయాన్ని కోరి దాన్ని సైతం అందుకోకుండానే వెళ్ళిపోయాడు.

    అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం ........ అంటారుగా ఇవి రెండూ వీడికి సిద్ధించాయి..... మహానుభావుడు.

      ఈ మాటలు మనసులో మెదలగానే నా కను కోలుకుల్లో నుండి రెండునీటి బిందువులు రాలి చెంపల మీదుగా జారి చోక్కాపై పడ్డాయి. 

      అప్పటి వరకు భారంగా ఉన్న గుండె బ్రద్దలైందేమో అన్నట్టుగా దుఖం తన్నుకు రాసాగింది. ఆపుకోడానికి ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు. ఛాతీ భుజాలూ ఎగిరెగిరి పడసాగాయి, నా పరిస్థితి గమనించిన వరలక్ష్మి నా వీపు నిమురుతూ  "అందరినీ ఓదార్చాల్సిన మీరే ఇలా కృంగి పోతే ఎలా" అంటూ ఓదార్చింది,

     వరలక్ష్మి స్వాంతన వాక్యాలు నాలో దుఖాన్ని రెట్టింపు చేసాయి, మేమున్నది ఆటో లో అని కూడా మరచిపోయి ఆమె ఒడిలోకొరిగి పోయి బోరున ఏడ్చేసా.....ఓ పదినిమిశాలలా ఎడిస్తేనేగాని నా గుండె బరువు తగ్గలేదు.     

      విశ్వం వాళ్ళ ఇంటికి చేరుకున్నాం

    భుజం పైనున్న ఉత్తరీయం తో కళ్ళు తుడుచుకుంటూ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను

   ఆశ్చర్యం

   ఆ ఇల్లు చావింటిలా లేదు

  సోఫా లో కూర్చుని పెద్దబ్బాయి రేహాన్ కాఫీ త్రాగుతున్నాడు. మూడోవాడు  అవినాశ్  లాప్ టాప్   తో కుస్తీ పడుతున్నాడు

    వంటింటి డోర్ కానుకొని సీతారాం తో మాట్లాడుతూ సుభద్ర నిలబడి ఉంది. రేహాన్ భార్య రేఖ వంటింట్లో బిజీగా ఉన్నట్లుంది, గిన్నెల శబ్దం వినిపిస్తుంది. ఎక్కడా శవం కనిపించట్లేదు.

     సీతారాం మమ్మల్ని చూసి  "ఓ! వచ్చారా ! రండి నేనే కబురు పెట్టాను, ఎంతైనా ఆయన గారికున్న ఆత్మీయులు ఆపద్భాందవులు బాల్య స్నేహితులు మీ రొక్కరే గా!" అంటూ లోనికి పిలిచాడు.

    నా మతి పోయింది ఇంట్లో ఓ మనిషి చనిపోతే వీళ్ళింత కామ్ గా ఎలా ఉండగలుగు తున్నారో నా కర్థం కాలేదు

    "పదండి అవుట్ హౌజ్ లో శవం ఉంది" అంటూ అటు వైపు కదలాడు, అతన్ననుసరించి మేము వెళ్లాం .

   మంచానికి ఆరడుగుల దూరంలో నేలపై అస్తవ్యస్తంగా పడి ఉన్నాడు విశ్వం.

    రాత్రి ఎప్పుడో ప్రాణం పోయినట్టుంది, శవం బిర్ర బిగుసుకు పోయింది. కనీసం చెదిరిన లుంగీని సైతం సరిచేయలేదు.

     "రాత్రే పోయాడనుకుంట,ఎవరమూ చూళ్ళేదు, ప్రొద్దున్నే పనమ్మాయ్ గది ఊడ్వడానికొచ్చి చూసి మాకు చెప్పింది వెంటనే మీకు కబురు చేసా" అని సీతారం చెబుతుంటే నా గుండె నెవరో పిండినంత బాధేసింది.

     అందరూ ఉంది ఎవరూ లేని ఏకాకి లా పోయాడు,.......

   శవం దగ్గరకెళ్ళి చెదిరిన గుడ్డలు సరిచేసి సరిగా పడుకోబెట్టి పనమ్మాయి ని కేకేసి తలవడ్డ దీపాన్ని వెలిగించా
     ఈ లోకం లోని రాగాద్వేశాలతోను కుట్రలూ కుతంత్రాలతోనూ పనిలేదని నిశ్చింతగా నిద్రలోకి ఒదిగి పాయినట్టుగా   ప్రశాంతంగా ఉన్న వాణ్ని చూస్తుంటే నా కళ్ళు జల పూరితాలయ్యాయ్
                    ఓ మిత్రమా నువ్వే కదా ఈనాటి విజేతవు

                  " పుట్టిన ప్రతి ప్రాణి జీవన గమ్యం మరణమే అయితే

                   ధనవంతుల బలవంతుల నేన్దరినో ఎందరెందరినో 

                   ఓడించి లక్ష్యాన్ని సాధించిన పందె కాడవు నువ్వు

                  ఈ రోజు విజేతవు నీవు, గమ్యానికామడ దూరం లో

                  ఆగి లకష్యాని చేరలేక మేమోడిపోయాం ఈ పాప కూపం లో మిగిలి పోయాం"

 
అని అనుకున్నాను ,

     "మున్సిపాలిటీ వాళ్ళు మధ్యాహ్నం ఒంటిగంట దాటితే కాని రావడానికి కుదరదన్నారంకుల్" అని సీతారం తో రేహాన్ చెబుతుంటే అర్థం కాక ఏమిటన్నట్టు సీతారం కేసి చూసాను.

    నా చూపుల్లోని భావాన్ని గ్రహించిన అతను  " పిల్లలండి, మన ఆచారాలు వ్యవహారాలవేం వాళ్లకు నచ్చవు,శవాన్ని దహనం చేయడమే కదా కావలసింది, అంతోటి దానికి తమ పనులను పాడుచేసు కోడమెందుకని మున్సిపాలిటీ వాళ్ళ కప్పగించాలనుకుంటున్నారు. వాళ్ళు చేసేది కూడా   అదే కదా, బూడిద చేసే దానికి ఎవడైతే ఏంటని సెంటిమెంట్ పేరా తమ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోడమెందుకు అన్నది వీళ్ళ అభిప్రాయం, వాళ్ళ కుటుంబ విషయం లో మనం తల దూర్చడం ఎందుకు అని నేను ఓకే అనేసా,.......... " అంటూ పరోక్షంగా నా నోరు మూయించ డానికో హెచ్చరిక అన్నట్టుగా చెప్పాడు.  

   సీతారాం మాటలు నన్నెంతో బాధించాయ్

    సుభద్ర వద్దకెళ్ళి   " ఏంటమ్మా! ఇది ఇలా చేస్తారా? ఎవరైనా!" అని నిలదీయ బోయాను .

    "అబ్బాయ్ ఎలా చెబితే అలాగే కానివ్వండన్నయ్య" అంది. నెమ్మదిగా.

    ఆమె అలా అనగానే లాగిపెట్టి ఓ చెంపదెబ్బ వేయాలన్నంత కోపం వచ్చింది. కాని నా విజ్ఞత నా ఆవేశాన్ని చల్లార్చింది.

       "ఆర్గ్యుమెంట్లక్కర లేదంకుల్  ఈ మనిషికి ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండనిచ్చి తిండి పెట్టిందే మహా గొప్ప. ఇంకా దహనాలు దశ దిన కర్మలు ........ నాన్సెన్స్ ................
       వీడు అమ్మను వంచించి లొంగదీసుకున్న కామాంధుడు, తన సుఖాల కోసం అమ్మను తన వారందరికీ దూరం చేసిన స్వార్థ పరుడు, మామయ్యల పరువును మంటగలిపి అవమానించిన దుర్మార్గుడు." ఆవేశంగా ఇంకా ఏమేమో అనాలనుకుంటున్న రేహాన్ సీతారాం సైగతో తన మాటలనాపి వగరుస్తూ ఉండిపోయాడు.

     వాడలా ప్రేలుతుంటే నేను ఉగ్ర నారసింహాన్నేఅయ్యాను
    కోపం తో నా కళ్ళు చండ్ర నిప్పులే అయ్యాయ్,ముక్కుపుటాలు ఆదరసాగాయ్, దవడ కండరం బిగుసుకుంది, రెండు పిడికిళ్ళు బిగుసుకున్నాయ్. కోపంగా రేహాన్ కేసి చూసాను, ఆ చూపులకే శక్తి ఉంటె వాడు నిలువునా బూడిదయ్యేవాడే.......
     నా హృదయంలో చేల రేగుతున్న భాడాభాగ్నిని గమనించిన మా వరం తన చేతితో నా చేతిని నొక్కి కళ్ళతో శాంతించండి అన్నట్టుగా చూడ్డం తో ఎంతో ప్రయాస తో నా కోపాన్ని చల్లార్చుకున్నాను.

   కోపం స్థానంలో ఆ కుటుంబమంటేనే అసహ్యం కలిగింది.

     నా ప్రాణ స్నేహితుడు నిలువెత్తు త్యాగమూర్తి, ప్రేమకే పర్యాయ పదం, ఒక ఐనింటి అమ్మాయి కష్టాన్ని చూసి తట్టుకోలేక తన బ్రతుకునే త్యాగం  చేసుకున్న అమృత మూర్తిని అనాధలా మున్సిపాలిటి వారికప్పగించడం నచ్చలేదు, అలా అని స్వతంత్రించే స్థితిలో కూడా లేను.
    రెండు నిమిషాలాలోచించి ఓ నిర్ణయానికొచ్చాను,

   "చూడండి సీతారాం గారు, వాడికి తల కొరివి పెట్టి మీ మీ అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు.సంస్కారం లేనివాళ్ళు మొక్కుబడిగా చేసే దిన ఖర్మ లేమి  అక్కరలేదు కాని అనాధగా మున్సిపాలిటి వారికి అప్పగించే బదులు ఏదైనా మెడికల్ కాలేజి వాళ్లకు అప్పగిస్తే వాడి ఆత్మ సంతోషిస్తుంది. మీకు ఓకే అయితే కాలేజ్ కి ఫోన్ చేస్తాను" అని నా నిర్ణయాన్ని చెప్పి వాళ్ళ సమాధానానికి ఆగాను.

    నా మాటలు వాళ్లకు తోడ గిల్లి జోల పాడినట్టుగా అయిందని వాళ్ళ ముఖాలే చెప్పాయి.

   వాళ్ళు దానికి ఒప్పుకోవడం తో మెడికల్ కజేజ్ కు ఫోన్ చేయడం వాళ్ళు రావడం వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని చక చకా ముగించుకొని అంబులెన్స్ లో శవాన్ని తీసుకెళ్ళడం ఓ మూడు గంటల్లో పూర్తయింది.

     అంబులెన్స్ లో శవాన్ని ఎక్కుస్తుంటే నా కళ్ళనుండి జారే కన్నీటికి అడ్డు కట్ట వేయలేక పోయాను.

   
   "మిత్రమా! క్షమించు, అనాధ లా దహనమై బూదిదయ్యేకంటే నీ శరీరం కొంత మంది భావి వైద్యులకైన ఉపయోగ పడితే నీ ఆత్మ శాంతిస్తుందని నేనీ నిర్ణయం తీసుకున్నా, ..... నా నిర్ణయం సరైనదే అయితే నన్నాశీర్వదించు, ఒక వేల తప్పే అయితే ఓ మూర్ఖ స్నేహితుని తప్పిదం అని క్షమించు." అని మనసులోనే వేడుకొని మా వరాన్ని తీసుకుని ఇంటి ముఖం పట్టాను.

    మౌనంగా నాలుగడుగులు వేసాము, జరిగిన  బాగోతాన్నంతా  దగ్గరుండి చూసిన వరానికి ఏమి అర్థం కాక,  అయోమయ స్థితిలో ఉందని నాకు తెలుసు.

    తన సందేహాలను తీర్చుకోకుండా ఇక క్షణం కూడా ఉండలేడని తెలుసు.

      ఇక ప్రశ్నల పరంపర ప్రారంభ మౌతుందని తెలుసు.

    నా ఆలోచనలు నాలోనే ఉన్నాయ్, మౌనంగానే ముందుకు నడుస్తున్నాం.

    మౌనాన్ని భంగం చేస్తూ "ఎంటండి,వాల్లేంటి అలా ప్రవర్తించారు," నేనను కున్నట్టుగానే తన సందేహాలను నివృత్తి చేసుకోడానికి ప్రయత్నాన్నారంభించింది.

      "ఏమండీ! అన్నయ్య అంత దుర్మార్గుడా,కన్నా కొడుకే అలా అంటున్నాడంటే అయ్యే ఉంటుంది లెండి. నా స్నేహితుడు నా స్నేహితుడు అని వెనకేసుకు రాకండి, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి" అన్నది మా వరం నాకేసి ఏదోలా చూస్తూ.

      ఆవిడతో ఏ విషయాన్ని చర్చించొద్దు అనుకున్నాను కనుక ఆమె ప్రశ్నలకు సమాధానంగా కాకుండా " ఎవ్వరిన తండ్రికి తల కొరివి పెట్టను అన్నాడంటే అర్థం కాలేదా పిచ్చిదానా చచ్చిన వాడి గురించి చెడ్డగా మాట్లాడంటేనే వాళ్ళెంత బుద్ధి మంతులో అర్థం చేసుకోవచ్చు." అన్నాను.

        "అదికాదండీ. అసలు ఈ చనిపోయినాయన దుర్మార్గుడా కాదా అది చెప్పండి ముందు" అని అడిగింది. నేనేం బదులివ్వలేదు, నిశ్శబ్దంగా నడవసాగాను

    తిరిగి అదే ప్రశ్నను కాస్త హెచ్చు స్వరంతో అడిగింది, అయినా నేను నా మౌనాన్ని వీడలేదు.

    నా మౌనం ఆమె నమ్మకాన్ని పెంచిందేమో, " మీ స్నేహితుడని ఎంతో గౌరవించాను ఇలాటి వాడని ముందే తెలిస్తే ఇంట్లోకి కూడా రానిచ్చేదాన్నికాదు" అంది.

          ఆమె మాటలు శూలాల్లా నా గుండెని గుచ్చుకున్నాయి.కోపంగా ఆమెకేసి చూసి,

     "వాడి గురించి నీకేం తెలుసని అలా నోరు పారేసుకుంటావ్ తెల్లనివన్నీ పాలు కావు కదా అతనో మహాను భావుడు ఓ త్యాగమయి ప్రేమ తత్వం మానవత్వం మూర్తీభవించిన ఓ గొప్ప వ్యక్తి అతనంటే ఏమిటో తెలిస్తే వీళ్ళు ఎంతటి దుర్మార్గులో అర్థమౌతుంది, " అన్నాను.

     "చెప్పంది ఎలా తెలుస్తుంది చెప్పండి మరి మీ స్నేహితుని మానవత్వం ప్రేమతత్వం" హేళనగా అన్నది.        

     ఆమె కంటం లోని హేళనకు నాకు ఒళ్లంతా కంపరం పుట్టింది. 

     ఆమెకు విషయం చెప్పాలనే నిర్ణయించుకున్నాను. "పద నడుస్తూ చెబుతాను వాడి గురించి," అని ఎలా మొదలు పెట్టాలా అని ఓ నిముషం ఆలోచించి

         "ఒంటు కుదిరేవరకు వాడిన కాగితాన్ని ఒంటు కుదరగానే చిత్తు కాగితమని నలిపి చెత్త కుండీలో పారేస్తాం కదూ" అని అడిగాను.

     "అన్నయ్య గురించి చెప్పవయ్యా అంటే కాగితాలు లెక్కలు అంటూ మొదలు పెట్టావ్ ఎప్పుడూ మీకు ఈ కాగితాలూ కలాలూ లెక్కలూ ఉండేవే. ఆయన గురించి చెప్పండి" విసుక్కుంది.

      ఆమె ఆత్రానికి నవ్వుతూ   
" నాది విశ్వంది సుభద్రది ఒకటే ఊరు, సుభద్ర వాళ్ళు ఎంతో సంపన్నులు, విశ్వం పదెకరాల భూమికి వారసుడైనా తండ్రి చిన్ననాటనే పోవడం తో పెళ్ళికాని ఇద్దరి అక్కలు ఒక చెల్లెలు రోగాలతో మంచం పట్టిన తల్లి బాధ్యత ఉండడం తో పది తర్వాత చదువు నాపేసి వ్యవసాయం చేస్తూ పాతికేళ్ళ వయసులోనే ఇద్దరక్కల ఒక చెల్లెలి పెళ్లి  చేసాడు.

        సుభద్ర  వాళ్ళ కాలేజ్ లో చదివే ఓ ముస్లిం అబ్బాయ్ తో ప్రేమ వ్యవహారం నడిపి ఒక రోజు వాడితో లేచిపోయింది, పరువు ప్రతిష్ట లకు ప్రాణం పెట్టె వారి కుటుంబంలో ఈ వార్త సునామే అయింది.  

      కూతురు ల్ర్చి పోవడం తో పరువు పోయిందని భావించిన ఆమె తండ్రి ఉరి పోసుకుని పోయాడు, కూతురుతో పరువు, పరువుతో భర్త పోవడం తో తట్టుకోలేని ఆమె తల్లి కూడా కొద్ది రోజుల తేడాతో  గుండెపోటుతో పోయింది.    

       వాళ్ళ కుటుంబం ఊళ్ళో తిరగడమే మానుకున్నారు కొంత కాలం,

       దేన్నైనా కాలమే మానిపిస్తుందిగా అందరూ సుభద్ర గూర్చి మర్చిపోయారు, ఐదేళ్ళు గడచిపోయాయ్  ఎవరిపనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అప్పుడు వీళ్ళందరి జీవితాలని  ఒక్క కుదుపు కుదిపిన సంఘటన జరిగింది.

     ఇద్దరు పిల్లలను వెంటేసుకుని సుభద్ర అన్న వాళ్ళిల్లు చేరింది, ఘోర రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడని అత్త మామల వద్ద కెళితే ఇంట్లోకి రానివ్వలేదని ఏడ్చింది, ఇక్కడ అదే జరిగింది, వీళ్ళూ ఒప్పుకోలేదు, ఏడ్చింది, తనకోసం కాకపోయినా ముక్కు పచ్చలారని పసికూనల కోసమయినా చెల్లలిగా కాకపోయినా పనిమనిషిలా అయినా తనకు ఆశ్రయమిచ్చి పిడికెడు మెతుకులు పెడితే చాలంది.

    సీతారాం కాళ్ళ మీద పసికూనల వేసింది, అయినా సీతారాం గుండె కరగలేదు, పైగా పసివాడని కూడా చూడకుండా కాలితో తన్నాడు, ఏకంగా ఆమె చిన్నన్నయ్య పొలాలకు వేసే పురుగు మందు డబ్బా తెచ్చి ఆమెకిస్తూ "నువ్వో నీ పిల్లలు తాగి చావండి ఇంకా బ్రతికారని తెలిసిందో నేనే చంపేస్తా నంటూ ఆమె జుట్టు పట్టుకొని ఇంటవతలకి గెంటేసాడు.

         అడ్డు పోయిన మమ్మల్ని వాళ్ళ కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దని బెదిరించాడు, ఆ కుటుంబమంటే మాలో ఉండే భయ భక్తుల వాళ్ళ మేమంతా మౌన ప్రేక్షకుల మయ్యాము, ఆమె పట్ల మాకు సానుభూతి ఉన్న ఏమి చేయలేక పోయాము,

        సుభద్ర ఏడుస్తూ చేసేదేం లేక చెరువు గట్టు పైకి వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చుని ఏడవ సాగింది, ఈ ఆకలి చూపులతో అవకాశం ఎప్పుడొస్తుందా ఎలాగైనా అందాల రాశి ని లొంగదీసుకొవాలని ఎదురు చూస్తున్న మగ మృగాలున్న ఈ లోకంలో    బ్రతకడం కష్టమే నని గ్రహించి తన పిల్లలని చంపి తానూ చావడానికే సిద్దమైన ఆ వేళ

      అప్పుడే పొలం నుండి వచ్చి విషయం  తెలుసుకున్న విశ్వం పరుగు లాంటి నడక తో సుభద్రను చేరి ఆమె చేతుల్లోని విషం డబ్బాని లాక్కుని పిల్లలని తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు, ఆమెకు ఆశ్రయమిచ్చాడు.

       ఈ విషయం తెలిసి సీతారాం రఘురాం లు పంచాయతి పెట్టించారు, ఒక అయినింటి అమ్మాయిని అన్నలమైన మేమే కాదూ కూడదు అని తిరస్కరించాక  నువ్వు నీ ఇంట్లో ఎలా ఏ అధికారం తో ఉంచుకున్నావని అడిగారు. ఆ పంచాయతిలో, అది తమని అవమాన పరచినట్టే నని బెదిరించారు.       
       వయసులో ఉన్న ఆడపిల్లని ఏ హక్కుతో ఇంట్లో పెట్టుకున్నావని అడిగారు, ఏ సంబంధం లేక ఒక అమ్మయినల ఇంట్లో పెట్టుకోవడం వాళ్ళ ఊరు చెడిపోతుందని హెచ్చరించారు.
  
    ఎవరెంత అన్నా విశ్వం తొణక లేదా బెనక లేదు "ఆపదలో ఉన్న స్నేహితురాలిని ఆడుకోవడం తన ధర్మమని మానవత్వం మంట గాలిపె విధంగా ప్రవర్తించిన వారికి తనని ప్రశ్నించే అధికారం లేదని, ఒక అమ్మాయిని ఆదరించా డానికి హక్కులు హోదాలే అవసరమైతే తాను ఆమెకిష్టమైతే ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు భర్త హోదాతో ఆమె పిల్లలకు తండ్రిగా వారిని ఆదరిస్తా నని సభా ముఖంగా చెప్పాడు,

    ఆమెకూడా ఈ పెళ్ళికి తన సుముఖత తెలపడం తొ మేమంతా దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసాం, ఒక ఉన్నత కుటుంబానికి చెందినా అమ్మాయిని ఆ కుటుంబా న్నెదిరించి పెళ్ళిచేసుకొని ఆ ఊరు పెద్దమనుషులను ఎదిరించాడని గ్రామ బహిష్కరణ విధించారు కూడా, ఊళ్ళో వాళ్ళ తీర్పుని గౌరవించి తనకున్న పదేకరాలని అమ్ముకుని దగ్గరున్న టౌన్ కి వలస వెళ్లి పోయాడు, అతని పదేకరాలని చాల చవకలో కొట్టేసాడీ సీతారాం.

    ముసలి రోగిష్టి తల్లిని ఇద్దరు పసి కూనలని భార్యను తీసుకొని టౌన్లో ఇరుకు ఇంట్లో కాపురమారంభించారు,పెద్ద చదువు లేకపోవడం తొ పచారి కోటలో గుమస్తాగా జీవనాన్నారంభించి చాలీ చాలని జీతంతో బ్రతుకు బండి సాగదీసాడు.

   తర్వాత నాకు నీతో పెళ్లయింది ఉద్యోగ రీత్యా మనం ఈ పట్నం వచ్చాం, నా బ్రతుకు నా సంసారం నా బిజీ నాది పోయింది, టౌన్ లో ఎంతో కష్ట పడి తన శక్తికి మించి పిల్లలను చదివించాడు. వీళ్ళిద్దరికీ పుట్టినాడు చిన్నాడు అవినాష్.
 
     పెద్దన్ని కెమికల్ ఇంజనీర్ను చేసాడు రెండోవాడు డాక్టర్ మూడోవాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వీళ్ళంతా ఫారిన్ లో యం యస్  చేసోచ్చిన వారే.

    ఉద్యోగాల పేరిట ఎప్పుడైతే వీళ్ళు పట్నం గడ్డ నెక్కారో అప్పుడే సీతారాం రఘురాం దృష్టిలో పడ్డారు, చదువుల్లో బాగా స్థిరపడిన పిల్లలను చూసి వాళ్లకు క్రమంగా దగ్గరయ్యారు పెద్దాడికి సీతారాం కూతురుని రెండోవాడికి రఘురాం కూతురిని ఇచ్చి పెళ్లి చేసి విశ్వం పై ఎన్నో ఎన్నెన్నో అభూత కల్పనలు చెప్పి పిల్లల మనస్సులో విష బీజం నాటారు.

     పిల్లలకు విశ్వమంటే అసహ్యం కలిగేల మార్చడంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు. దాని ఫలితమే ఇప్పుడు నువ్వు చూసిన విన్న తతంగం...... ఇప్పుడు చెప్పు విశ్వం దుర్మార్గుడా నరరూప రాక్షసుడా?" అని అడిగి ఆమె జవాబు కొరకు ఎదిరి చూసాను.

    "అమ్మో! ఈవిడ గారు మహా గడుసు పిండమే, అంతలా ఉపకారం చేసిన భర్తని అలా అనాధలా ఎలా వదిలెయ గలిగిందండి పాపం అన్నయ్య జీవిత మంతా కష్టాలే"  అని మళ్ళి "మీరావిడ గారిని నాల్గు మాటలు కదిగేలేక పోయారా?"అంది

      "ఆమెదేం  తప్పోయ్  మీ ఆడవాళ్ళ సహజగుణమే అంత, పుట్టింటి వాళ్ళన్నా కన్నా పిల్లలన్నా మమకారం ఎక్కువ ఒక వయసంటూ వచ్చాక భర్తతో నవ్వుతూ మాట్లాడాలన్న భయమే పిల్లలెక్కడ
చూస్తారో అని పిల్లలు భర్తతో అంటి ముట్టి ఉంటె ఏమనుకుంటారో అని సిగ్గు,

    రాత్రి భర్తతో పడుకోవడానిక్కూడా ఇష్టపడరు కదా అందుకేగా నువ్వు పిల్లలు పెద్దయ్యారు అంటూ మనవలతో పడుకుంటున్నావ్. నాకోక్కడికి ఔట్ హౌజ్  ఇచ్చినట్టు వేరే గది నిచ్చారు, కనీసం మీ  స్పర్శ కూడా   తగల నీయకుండా జాగ్రత్త పడతావ్, ఎప్పుడో నేను కూడా విశ్వం గాడిలా ఏ రాత్రో ఏ గుండె నేప్పో వచ్చి అనాధలా పోతాను, తెల్లవారి కాఫీ తెచ్చి నా శవానికి త్రాగిద్దువులే ." నిష్టూరంగా అన్నాను.

   నా మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుందేమో మా వరలక్ష్మి

       "క్షమించండి, మీరెన్ని సార్లో చెప్పారు కానీ నేను మీ చిలిపి వేషాల కోసం అంటున్నా రానుకున్నా నండి" అంది.

      " ఏం చిలిపి పనులు చేస్తే తప్పేంటి, వయసు శరీరానికే గాని మనసుకు కాదోయ్, శృంగారం లో బాగా ఎంజాయ్ చేసే వాళ్లకు రోగాలు అంతల బాధించవు  తెల్సా  ఈ ఊబకాయాలు కీళ్ళ నెప్పులు మానసిక సమస్యలు ఉండవ్ పైగా పూర్ణా  యుష్యులై బ్రతుకుతారు. ఇటీవలి పరిశోధనల్లో బహు భార్యలున్న వాళ్ళు దీర్ఘాయుష్యులని తేలిందట తెల్సా?"......... నవ్వుతూ అన్నాను

  " ఛీ పొంది మిమ్మల్ని మాట్లాడనిస్తే శృంగారం గూర్చి ఏకధాటిగా నలభై రోజులు అంటే ఒక మండలం పాటు మాట్లాడతారు చిరునవ్వుతో అంటున్నా మా వరం ముఖం సిగ్గుతో ఎర్రబడడం చూసాను.