Tuesday 16 July 2013

విరిశరాలు

                                                          విరి శరాలు
                                                             విరించి

      [ ఇది నూతన ఛందో ప్రక్రియ, ఇందు నాలుగు పాదాలుంటాయి, ప్రతి పాదం లో మొదట మూడు ఇంద్ర గణాలు  తరువాత ఒక్క సూర్య గణం కాని గగం కాని ఉంటుంది, యతి నియమం లేదు ప్రాస మాత్రం ప్రతి రెండు పాదాలకు చివరి అక్షరాలకు ప్రాస కుదరాలి. సమకాలీన వ్యవస్థ పై వ్యంగ్యం ఎగతాళి తో కూడిన హితవు ప్రధాన లక్షణం ] 

1)   నే చెప్పు నుడులెల్ల జగమెల్ల తెలుసు
      అవియే మొ కొందరి కంట్లో నలుసు
      వినరండి నా మాట ఉన్ననూ పెళుసు
      కాకూడ దెవ్వడు ఇతరుల కలుసు

2)  అవినీతి కృత్యాలు పెంచు పాపాలు
     వలదంటే వచ్చునే ఎన్నొకోపాలు
      ధనమున్న నేలరా తెగ మురిపాలు
       నీతి గలిగిన చోట గంజియే మేలు.

3)  తెలుగు పలుకులు పలుకంగ వాడి
     అందుకే రాసాను యా తెలుగు వాడి
     మాతృ భాష నిలుప మనకదే పాడి
     నిలపాలి పరభాష తోడి పోరాడి.  

 4)  ప్రైవేటు బళ్ళలో పంతుళ్ల  కన్న
      బంట్రోతు జీతమే బహుబాగు రన్న
       భావి పౌరుల తీర్చు బాధ్యతే యున్న
       గుర్తింపు లేనట్టి గుది బండరన్న

 5)  నా వలలో చిక్కె యందాల చేప
      చేప కానేకాదు పక్కింటి పాప
      తిరిగాము హాయిగా ఎన్నెన్నొ చోట్లు
      తరువాత చూడంగ పర్సుకే తూట్లు

 6)  ప్రతివాడు నాటాలి ప్రతిచోట చెట్లు
      దేశ ప్రగతికవి యౌతాయి మెట్లు
      అది చెప్పసర్కారు ఖర్చేమొ కోట్లు
      తరువాత రోడ్లంటు నరికేరు చెట్లు

 7)  అవసరార్థమె యంచు చేయొద్దు అప్పు
      కొలిమిలో మండే భగభగల నిప్పు
      దానితో పొంచి యుండేనట ముప్పు
      అందుకే చేయకు అది చాల తప్పు

  8)  పరుల వృద్ధిని కాంచి ఎడ్చేటి వాడు
       మంటలారని రావణాసుర కాడు
       ఉండకూడని బుద్ధి అది భీమ పాడు
       తెస్తుంది తుదకది వాడికే కీడు

  9)  జేబులో ఉన్నదా మితిమీరి డబ్బు
       పిలుచు చుండును దూరాన క్లబ్బు
       అది పాతదే యన్న ఉందిలే పబ్బు
       మరిగితే వదలదే మందుకీ జబ్బు

10)   భారతము చూడరా కౌరవుల్  వంద
       కురువంశమందు వారో పెద్ద మంద
       కందురా ఈనాడు అంతంత మంద
       పోషించు టెట్లింక చూడ నా బొంద         

11)  కుక్క కుండేటి వాలంబుయే వంక
       సరిజేయు మొనగాడు ఇలన లేడింక
       అల్పజనుల బుద్ధి ఉండునే వంక
        ఎంత మార్చిన నేమి మారబోదింక

12)  మధ్యంబు తాగేటి మనుజుడే గొప్ప
       అనుకున్న వానికి మిగులునే చిప్ప
       మంచి మాటలెపుడు వినుమురా యప్ప
       వినకున్న చెడెదవో వెర్రి నాగప్ప

13)  కొడుకు చదువుకున్న కట్నంబు హెచ్చు
       తెలివైన ఓ పిల్ల కొడుకునే మెచ్చు
       కట్నానికీ తోడు జీతంబు తెచ్చు
       పైసిచ్చి పనిచేయు యంత్రంబు వచ్చు

14)  మాయ మాటలు చెప్పు వాడినే నమ్మి
       తనకున్న విలువైన ఓటు నే యమ్మి
       టక్కరి కధికార పీటంబు నిచ్చి
       పోతారు జనులింక  ప్రతిరోజు చచ్చి

15)   అధరాలకే రంగు అరువిచ్చినారు
         కురులనె ముడవాకా వదలేసినారు
        చిత్రాతి చిత్రంగ చెప్పులేసారు
        నాభినే చూపరుల కొదిలేసినారు

16)   బిగుతైన టీషర్ట్ వేసేటి ఇంతి
        సొంపైన పరువాల చూపునే ఇంతి
        జీను ప్యాంటును వేసి తొడల చూపించి
        చేల రేగుటేందుకే యందాలు పంచి

17)   నిలువెత్తు అందాల నెలత పూబోణి
        ఎద పైన వేయవే ఏదైన ఓణి
        జనులపై నీకింత జాలి ఏలంటి
        పరువాల కనువిందు పరులకేలంటి

18)   లోకాన్ని యాడించు సాధనం డబ్బు
        దాన్ని సాధించుటే మనవారి జబ్బు
         ఆ జబ్బు ముదిరినా ఇహచూడు గబ్బు
         ఆ గబ్బు వదిలించ లేదు ఏ సబ్బు

19)   సర్కారు కొలువులో టీచర్లు వారు
        పేద పిల్లలనేమి ఉద్ధరించేరు
         పిల్లలన్ కానిగీ బడికి పంపేరు
         దండిగా జీతాలు దండుకునేరు 

20)   ఆశ్రమమొక్కటి స్థాపించినాడు
         ఆధ్యాత్మి కమ్మంటు బోధించుతాడు
         మూరెడు గడ్డంబు పెంచునే చూడు
         స్త్రీలతో చాటుగా సరసంబు లాడు  

21)    పిచ్చోడి చేతిలో రాయిరా ఓటు
         ఎరుగనే ఎరుగము పడుతున్న చోటు
          ఆనకా జనులకే  చేసెను చేటు
          జాగర్త ముందుంది విష సర్ప కాటు

22)    అగ్ర వర్ణాలంటె ఎవరురా వారు
         సర్కారు దృష్టిలో శత్రువుల్ వారు
         రాబోవు కాలాన దళితు లయ్యేరు
         చరిత కందని హీన చరితులయ్యేరు. 
         

No comments:

Post a Comment