Saturday 12 April 2014

దేవుడా నిన్నేమనాలి

                                                         దేవుడా నిన్నేమనాలి                                                                              విరించి

ఎదుటి వాన్ని  బాధించి
వాడేడుస్తుంటే ఆనందించే వాడు
శాడిష్టైతే
దేవుడా నిన్నేమనాలి?

మానవులను సృజించి
మనసనే ఒక రసాంగాన్నందు ఆపాదించి
ప్రేమ అనే అనుభూతుల కల్పించి అనురాగాన్ని రంగరించి
రాగ బంధాలనే బందిఖానాలో బంధించి
ముందస్తు సూచన లేకనే
మరణమనే ఒకే ఒక వ్రేటుతో
పుటుక్కున బంధాలను త్రెంచి
బంధు జాలమంతా ఏడుస్తుంటే
నువ్వానందిస్తున్నావ్

అందాల హరిణాలను సృష్టించి
హరిణ మాడెడు అరణ్యాలలోనే
ఆహారంగా వేటాడెడు వ్యాఘ్రాలను
సృష్టించావ్

తాము బ్రతక డానికవి బలహీన
మృగాలను వేటాడుతుంటే
బక్క జీవులు ప్రాణ భయం తో
చావు కేకలు వేస్తుంటే
చూస్తూ ఆనందిస్తుంటావ్.

నిన్ను లీలా మానస మూర్తివని కీర్తించాలని
మాలో మమ్ము కొట్టుకు చచ్చేలా చేస్తున్నావ్
ఈలోకం లో బలహీనుడు బ్రతక కూడదా స్వామీ
బలమున్నోడే చుట్టమనుకుంటే
బలహీను ని  బలవంతుడి కి ఎర గా మార్చిన ఓ దేవుడా
నిన్నేమనాలి? ఏ పేరున పిలవాలి?  
        


 

No comments:

Post a Comment