Tuesday 18 March 2014

తెలుగువెలుగు

   తెలుగు వెలుగు 
     తెలుగు భాష తీపి తెలుగు సంస్కృతి మేటి 
     తెలుగు పల్లె లందు జిలుగు ధాటి 
     తెలుగు పదము యన్న వెలుగు పర్యాయంబు 

     తెలుగు బిడ్డ జాతి వెలుగు సుమ్ము 

     పూతరేకులరిసె పూర్ణంపు భక్ష్యాలు 
     కాకినాడ ఖాజ ఖాజు బరిఫి 
     పాలకోవ బూరె బందరు లడ్డంత 
     తీయ నైన భాష తెలుగు భాష 

     రమ్య మైన భాష రాజులేలిన భాష 
     ఆది కవుల గనిన అమ్మ భాష 
     సొగసు లీను భాష  సొబగైన భాషరా
     సాటి లేని భాష సరళ భాష 
      
     తీయ దనము నందు తేనెనే మరిపించు  

     కమ్మ దనమునందు కదళి ఫలము 
     రాజసమున తెలుగు రాయలి బిడ్డయై
     తేజ మొలుకు నాదు తెలుగు భాష 
     
     కదళి ఫలము ద్రాక్ష కర్జూరముల కన్న
     పనస జామ రేగు పండ్ల కన్న 

     అచ్చ తెనుగు భాష అత్యంత మధురంబు 
     విశ్వసత్య మిదియె విశ్వసింపు  

No comments:

Post a Comment