Sunday 3 May 2015

మానవ మేధస్సుకందనిదిదే సుమా!

కన్నులతో కాంచిన దృశ్యం
కలతలనేసృష్టిస్తుంటే
కలకలమై గెండెన లోతున
కలవరమై విజృంభిస్తే

కనుకొలుకుల నిలిచిన అశృవు
ఆణిముత్యమై మిలమిల మెరిసి
చెంపలపై జాలువారుతూ
మరకలుగా మిగిలే పోతే

గరిటెడు నీరే మరకలు తుడిచే
అద్దెకుతెచ్చిన ఆనందాల
చిరుచిరు కాంతుల
కృత్రిమ వెలుగులు

అంతరాలలో తనలో తననే
సమాధిచేసిన సామాన్యున్ని
అంచనా వేసె కొలమానాల్లేక
కూలి పోయెగా మానవమేధ

అంతరిక్షపు నౌకను కనుగొని
అఖండులమన్నా మేధావుల్లారా
మానవాంతరాలలో జరిగే మథనం
ఆవిష్కరించగల మొనగాడెవ్వడు?

No comments:

Post a Comment