Friday 1 May 2015

మలిసంధ్య

పుడమితల్లి కంటె పూర్వమందునలేచి
పూర్వాద్రిశిఖరాన్ని దాటి వచ్చి
నిర్విరామభుగా నిశాంతుడితగాడు
కార్యభారమొనరించె కర్మసాక్షి
భూవలయంబున పాపజన్ములు జేయు
దుష్కార్య క్రమముల జూచిజూచి
అలసి సొలసి పోయి అస్తమించగనెంచి
సిద్ధపడెను నిజము వృద్ధు డతడు
పశ్చిమాద్రుల మాటున్న పడకటింటికి జేర
వేగాన పయనంబు జేయనెంచే
పల్లపు మాగాణ పచ్చికన్ మేయుచు
స్వేచ్చగా తిరుగాడు పశు గణంబు
లోకబాంధవుడట్లు వేగాన కదలంగ
కట్టు బందీలుగా మారువేళ
ఆగమించెనంచు అల్లాడి పోయేను
పశుసంతతంతయు బాధపడియె
విహగాలతోసహ గృహములన్నియుకూడ
నిండిపోయెడు మలిసంధ్య ఆగమించె

No comments:

Post a Comment