Sunday 3 May 2015

ప్రభూ! నా మొరనాలకించవా!!

అమ్మ అంటే నాకిష్టం
అమ్మ భాషంటే మరీ ఇష్టం
అమృత తుల్యమైన వాక్సాగరాన
పదతరంగాల పదనిసలతో
భావవాహినీ ఆటుపోట్లతో ఊగిసలాడుతూ
కవితా వ్యసంగమనే నా నావ
ముందు ముందుకు కదులు తుంటే
ఏ సుదూర తీరాలకో చేరాలని లేదు
ఈ సాగరమధ్యమాన నా నావతోసహా
మునిగి పోవాలనుంది....

ఓ భగవంతుడా...
నీ అస్తిత్వమే నిజమైతే
నా భాషాప్రియత్వమే వాస్తవమైతే
ఓ చేతిలో కలం మరో చేతిలో కాగితం
భావాలలో నూతనత్వం మలయానిలమై
వీస్తున్న వేళ
నన్ను నీ లోకానిక్ తీసుకొని పో...

పుట్టిన నాడే కవిత్వం చెప్పగల ధీరత్వం ఎలాగూ లేదు
కనీసం చావైనా కవిత్వాన్ని రాస్తూ రాస్తూ
చావాలన్న నా కాంక్షని తీర్చవా ప్రభూ!....


No comments:

Post a Comment