Sunday 3 May 2015

కవి హృదయం

నా యదలో చెలరేగే భావావేశానికి
అక్షరరూపం ఇవ్వాలను కున్నా.....
కలంకదలదు.... అక్షరం రాలదు
యదలోని భావాలు మదిలోనే
సుశుప్తావస్తలో మాగన్నుగా నిద్రిస్తున్నాయ్........

నా ఆలోచనా తరంగాలు మాత్రం
సాగరకెరటాలకంటే వేగంగా
ఉవ్వెత్తున ఎగసిపడుతూనే ఉన్నాయ్.....కానీ,,,,

ఆలోచనలకొక రూపం ఉంటేనా
భావావేశానికొక ఆకారం రావడానికి
దృశ్యం వెనుక దృశ్యం మంచితనాల అదృశ్యం
మనోఫలకంపై మంచితనానికి సమాధి దృశ్యం

ఆకలిచే అలమటించు అన్నర్థుల పొట్టలపై
తండరగని బలవంతుడి బలిసిన పాదం
బాధాతప్త హృదయంతో చావుకేక వేయకుండ
కావెక్కిన రూపాయ్ నోటుతొ గొంతునొక్కే వింతదృశ్యం
మతమౌఢ్యం గోడలుగా కులతత్వం ఊచలుగా
బందిఖానా నిర్మించి బలహీనుల బందించి
స్వేచ్చా విహంగమై వికట్టాట్టహాసం చేయు
స్వార్థపరుల చేతులకే స్వర్ణకంకణాలయ్యే

గుమ్మికింద పందికొక్కు గుమ్మిలోన కందిపప్పు గమ్మున మేసేసి గుమ్మిని ఖాళీసేసి
ముసి ముసి నవ్వులతో మూతులనేతుడుచుకునెడు బలిసిన పందుల గాంచగ భగ భగ యదనే మండగ
పదం పదం కూర్చి నేను ప్రతిఘటించ యత్నిస్తే
కదలదాయె కలమెంతకు....
అడుగడుగున అన్యాయం అధికారిక ముద్రతోడ
ఇంతింతై వటుడింతై చందంబున పెరిగినట్టి
అన్యాయమే న్యాయమయ్యె
పదవినడ్డు పెట్టుకొన్న దొంగకేమొ జైళ్ళల్లో
ప్రత్యేకమైన గదులాయే పట్టెమంచాలాయె
కూటికొరకు జేబుకొట్టూ దొంగకేమొ శిక్షలాయె
యాడున్నది సమానత్వం సమ సమానత్వం

No comments:

Post a Comment