Saturday 4 April 2015

మసకబారుతున్న మాణిక్యాలు

మట్టి లోంచి మాణిక్యాలు
ఉత్పన్న మవడం సహజం
ఇది ప్రకృతి ధర్మం... ... ...

ధగధగా మెరవాల్సిన మాణిక్యాలు
మట్టితో కలిసి మసక బారడం
వ్యవస్థ లోని అసమర్థత

భవ్యంగా ప్రకాశించాల్సిన భావి భారతం
చెత్తకుప్పల మురికిగుంతల పాలయి
మసక బారుతున్న బాలభారతం

ఠిన  పాషాణాలే తప్ప కరిగే గుండెలు లేని
సమాజం భావి తరాలకొక సంఘవిద్రోహ శక్తిని
శ్రద్ధ ఉదాసీనత లనే ఎరువును పోసి
పెంపు చేస్తుంది... ... ... ...

మట్టిలో దొరలే  మసక బారిన జీవితాలలో
మరుగున పడిన మానవతా విలువలతో
మారణ హోమాన్ని సృష్టింటగలరనీ మరిస్తే
ఆ అమానుష ప్రక్రియలో ముందుగా మాడి
మసై బలయ్యేది నీవని మరువబోకు.

No comments:

Post a Comment