సుప్రభాతం
బాల భానుడు కదిలి పూర్వాద్రులే దాటె
కెంజాయ వర్ణమె గగనంబు నిండె
వృక్ష శాఖల లోన పక్షిజాతులు చేరి
భూపాల రాగాన సుప్రభాతము పాడె
మేలుకో మేలుకో జగ మేలుకో వలెనింక
నిదురెందుకో ...... మేలుకో జగమేలుకో
ఈ ఉషోదయంబే నీకు నవోదయం
ఈ నవోదయంబే నీచు మహోదయం
మహోదయంబే కావాలి శుభోదయం
మిత్రులందరికి శుభోదయం
No comments:
Post a Comment