Tuesday 7 April 2015

వడదెబ్బ — సన్ స్టోక్

ఆరోజు  రాంబాబు  ఆఫీసుకు  రాలేదు
అదే విషయాన్ని  ఆఫీసరు గారు రాంబాబు
క్లోజ్ ఫ్రండ్ గోపాలాన్ని అడిగాడు కారణమేంటని
దానికి గోపాలం ముక్తసరిగ "సిక్కంట సర్ "
ని బదులిచ్టాడు.

" సిక్కా యేమయిందేమిటి? " ఆఫీసరు ఆదుర్దా!
"వడదెబ్బంట! ఆస్పత్రికి  తీసుకెళ్ళారు" గోపాలం
వాబుకి కంగారు పడ్డ  సదరు ఆఫీసరు నమ్మలేక
" యూ మీన్  సన్ స్టోక్ ? " అడిగాడు
అతని కళ్ళల్లో  అనుమానం ప్రతిఫలిస్తుంది

"ఔను సర్ ! సన్ స్టోకే, " కన్ ర్మ్ చేసాడు గో॥లం
ఏమిటీ! ఈ జనవరి లో వడదెబ్బేంటి? నేన్నమ్మను"
ఫిసర్ గారు అనుమాన బాణం సంధించనే సంధించారు .

ఫీసర్ గారి మాటల్లో తీవ్రత చూసి అందరూ ఖంగుతిన్నారు
"వడదెబ్బంటే! ఆయనభార్యగారు అపురూపంగా
వండిన రాళ్ళలాంటి వడలు తగిలి ముక్కుబోన్
విరిగింది లెండి," రాంబాబు పొరుగున వుండే
సోంబాబు చెప్పాడు.

అబద్దాలంటె ఎంతమాత్రం గిట్టని ఆఫిసరీ
మాటలు విని  కోపంగా  గోపాలాన్ని చూస్తు
" సన్ స్టోక్ అన్నావ్ ? ఆయ్ ,,,,,," అన్నాడు

దానికి తలవంచుకుని నేమ్మదిగా
" ఔనండీ వాళ్ళ అబ్బాయి స్పూన్ తో
వడను విరవబోయాడు అంతే అది ఎగిరొచ్టి
రాంబాబు ముక్చుకు తాకడం ముక్కు
ఫ్రాక్చర్ కావడం జరిగీపోయింది" చెప్పాడు గో॥లం

No comments:

Post a Comment