Thursday 2 April 2015

దేవుడికే బదులుదొరకని ప్రశ్న

కడుపులో  బిడ్డ ఆడదని తెలిస్తే చాలు
కడతేర్చాలని  చూసే కసాయిలోకంలో
నా కెందుకు  జన్మనిస్తున్నావ్  దేవుడా!

కడుపులో నేనూపిరి పోసుకున్నానని
తెలిసిన్నాడు నా తల్లికెంతటి మన్ననలో!
నేనాడదని తెలిసి.... భ్రూణ హత్య వద్దన్ననాడు
ఆమెనెంతలా  హింసిస్తున్నారో! తెలిసి  కుములుతున్నా

ఓ... దేవుడా!!

ర్మభూమి  కర్మభూమని ఘనంగా చెప్పుకునే
ఈ నా మాతృభూమిలో  ఇంతటి  యమానుషమా!
ముగ్గురమ్మలనీ! మువ్వురమ్మల మూలపుటమ్మ
యని లక్ష్మీ పార్వతీ శారదలనారాధించే పవిత్ర
నేలమీదే  నేలతకు అడుగడుగున  అవమానాలా?

ఓ దేవుడా! ఈ సృష్టీలో స్త్రీ  జన్మయే  లేకుంటే
రేపటి తరానికి  రూపమెక్కడిదని అడుగుతున్నా!
బదులివ్వ లేవుకదూ నీకూ జవాబందని  సమస్యేనా
నారీలోకమంటే!!

No comments:

Post a Comment