Sunday 5 April 2015

మనిషికి సాధ్యంకానిది

ఓ... పరుగులు తీసే  కాలమా!
ఓ  సారి  వెను తిరిగి  చూడుమా!

నీ  పద ఘట్టనల  తాకిడికి
చితికిన  బతుకులెన్నో యెన్నెన్నో!
కూలిన కాపురాలూ యెన్నెన్నో!
అస్తవ్యస్తమైన  వ్యవస్థ లూ  ఎన్నో
సతమత  పరచే  సమస్యలూ ఎన్నెన్నో!

ముందటి  ధ్యాసేతప్ప  వెనుక
చూపన్నది  నీకు  లేదని  తెలిసే
నిన్నంటి ప్రళయాలు  ప్రమాదాలూ
విపత్తులు  ప్రకృతి విలయాలు
నీ వెంట పడుతుంటే .....
వాటి  నాపే శక్తి సామర్థ్యం లేని నువ్వు
భీరువు వై పరుగులు తీస్తునే  వుంటావు

పిల్లికి చెలగాటం  ఎలక్కి ప్రాణసంకటంలా
మీ పరుగు పందేం  మా బతుకులను చిద్రం
చేస్తున్నా  మూగగా భరిస్తూ  యెక్కడున్నాడో
తెలియని సాక్ష్యంలేని సర్వోపగతున్ని
వేడుకుంటున్నాం

పల్లానికీ  ప్రవహించే  యేరులా
నువ్  ముందు ముందుకు సాగుతూ నే వుంటావ్

సాగే నీటికి అడ్డుకట్ట వేసి వేగాన్ని నిరోధించి
సాగుకూ తాగుటకు ఇంకా ఇంకా యెన్నింటికో
మలచుకున్న మనిషికి నిన్ను నిలవరించడం
చేతకాక  మేధివినంచూ మిడీసిపడే మానవుడు
తలపట్టుకుంటున్నాడు.

No comments:

Post a Comment