Monday 1 June 2015

దత్తస్వీకార మహోత్సవం

దత్తస్వీకార మహోత్సవం

నింగి గొడుగుగా నేలనే పీఠంగా
తరువులు వాగులూ వంకలు
సూర్య చంద్రులే  సాక్ష్యంగా
మానవుడు స్వార్థాన్ని దత్తత
తీసుకుంటున్నాడు.....
మానవత్వానికి తిలోదకాలొదిలి

ఇష్ట సుతుడైన దత్తపుత్రుని ప్రేరణతో
తరువులనీ తెగనరుకుతున్నాడు
తన నివాసాలకూ  విలాసాలకూ.....

కాసారాలను ఖాళీ స్థలాలుగా యెంచాడేమొ
ఆక్రమించి హార్మ్యాలనూ నిర్మిస్తున్నాడు
ధనమనే కృత్రిమాసర క్షేత్రాన్ని సృష్టించి
దానికి బానిసై దానిచుట్టూ తిరుగుతున్నాడు
మానవీయ బంధాలకు మంగళం పాడి

తల్లిలేదు  తండ్రిలేడు  తోబుట్టువు తలపే లేదు
ఆత్మీయతానుబంధాలు అంతకంతకు మృగ్యమయ్యె
ధనమాతా జపమొక్కటె తారక మంత్రంబయ్యె


No comments:

Post a Comment