పల్లవి; రంగు రంగు బట్టలోడు
బొంగరాల బుగ్జలోడు
తొంగి తొంగి చూసుకుంటు
చోంగనేమో కార్చుకుంటు
ఇంగిలీషు మందు తెచ్చి
వంగతోట దాపుకొచ్చి
ఖుషి జేసుకుందమని
పైటకొంగు లాగిండు
సచ్చే సావూరో మావా ఎట్లా వేగనో
మావా
సచ్చే సావురో మావా ఎట్టా వేగనో
చరణం; గద్వాల కోక దెచ్చి అద్దాల రైక దెచ్చి
జాజిపూల మాలదెచ్చి జడలోన
తురుమవట్టె
గజ్జెల ఒడ్డానమిచ్చి ముద్దుతీర్చ
మంటునన్ను
యాడాడొ సెయ్యేసి యేమేమో
సేసినాడు
సచ్చె సావురో మావా యెట్టా వేగనో 2
చర; వంగ సేను గట్టుమీద వంగి గడ్డి
కోస్తుంటే
పైటజారి పరువాలే యెదతన్ను
కోస్తుంటే
కంటిజూపుతోనె వాడు అందాలు
జుర్రుతుంటె
సిగ్గుతోని నా ప్రాణం జివ్వు మన్నది
బరువెక్కిన నా గుండె జల్లు
మన్నది
సచ్చెసావురో మావా యెట్టా వేగనొ 2
No comments:
Post a Comment