Thursday 4 June 2015

విజయ హారతి

సారథి కే విజయమాల

కావ్యం గొప్పదైతే
దాని కీర్తి ప్రతిష్ఠలు
దానిని రాసిన కలానికి
యెంత మాత్రం దక్కదు

కలాన్ని కదిలించిన
కరానికీ దక్కుతుందా!
అంటే కలమూ ఆ భాగ్యానికి
నోచుకోదు....

కలాన్ని కదిలించడానికి
ప్రేరణయై ఉవ్వెత్తున యెగసి
పడే భావఝరీ లహరుల
మూలస్థావరమైన మనసూ
ఇక్కడ అనామిక గానే మిగిలింది

యద తంత్రుల రవళుల భావజాల
సంపుటాల సంచితమైన మనసు
స్పందనలకు ప్రెరేపితుడై
మనో మంజీర నాదాల కనుగుణంగా
కరవాలం లాంటి కలాన్ని ధరించి
మనసు యానతులకనుగుణంగా
కరాన్ని కదిలించిన సారథి కవికే
గదా విజయ ఫలాలు దిగ్విజయ హారతులు

No comments:

Post a Comment