Saturday 6 June 2015

దేవుడా న్యాయమా?

దేవుడా ఇదేం న్యాయం?

ఆగ్రహించింది నీవు
హతమార్చింది నీవు
ఆలికంట నీరు జూసి
అనుగ్రహించిందీ నీవు

పెంచుకొన్న పిండిబోమ్మ
ఎడబాటుకు తాలలేక
ఏడ్చినట్టి పార్వతమ్మ
బాధను తొలగించినావు

పేగుతెంచుకు పుట్టినట్టి
సంతానమె కోల్పోయి
గర్భశోక తల్లుల రోదనలే
వినపడవా...లోకరక్షకుడా!

నీ భార్యకో న్యాయము
పరులకింకో న్యాయమా?
పరమాత్మా నీకిది
న్యాయమా? న్యాయమా?

అందాల హరిణాలను
అవనియందు సృష్టించి
వాటిని వేటాడ గల్గు
వ్యాఘ్రాలను సృజియించి
తమాష చూస్తుంటావు
తగునా యిది ధర్మప్రభో!

అబలురనే భక్షించే
బలవంతుల పుట్టించి
అడుగడుగున నిర్భలులను
నిర్జీవుల చేయుటేల?

మడుగులోన మకర మొకటి
ఆకటిబాధన కరిని బట్ట
వేగానా చేరితి వట మకరిని
తుదముట్టించ నెంచి....

గజరాజుకు ఒక న్యాయం
హరిణాలకు మరియొకటా?
యేవిధి నీ లీల తెలుప
అల్పుల మా వశమా?

No comments:

Post a Comment