Friday 5 June 2015

నా"నానీ"లు

నా"నానీ"లు

చదువుకుంటే
కుంటురా ఆ చదువు
చదువు కొంటేనె
అంటురా నేడు       1

పిసినారీ కెన్ని
నీతులు చెప్పినా
మారబోడు వాడు
దాన మిడడు   2

టిక్కట్లన్ని
దగ్గరే పెట్టుకుని
అడుక్కుంటా డందర్ని
కండక్టర్    3

బరువైన బ్యాగులు
బాలుర కెత్తిరి
బతుకు భారమనే
పాఠమేమో  4

పాపభీతి మరచి
దైవదూషణ జేసి
సాధింతు వేమి
పాపంబు మూట     5

ఉన్నవాడి తిండి
నాల్క రుచుల కోరకు
పేదవాడి తిండి
పొట్ట కొరకు  6.

కలిమి యున్న వాడు
కాంచనాలను
మోయగలడే గాని
మేయలేడు   7.

కట్నమడుగు వాడు
కాడెద్దురా వాడు
హీనుడౌను వాడు
నీచుడౌను  8.

ఆంగ్ల మాంగ్ల మంచు
అరచు చుండు
అల్పుల కేమెరుక
ఆంధ్రభాష ఘనత  9.

తరువుల పెంచు
కరువుల దృంచు
సిరులను పెంచు
సుఖముల పంచు  10.

తరుణి లేనీ నాడు
ధరణియే ఉండదు
ఆడదంటే అమ్మ
అవని కంతా   11.

ఆడదంటే చాలు
అలుసేలరా మీకు
భ్రూణదశన నామె
చంపనేల  12.

చదువు కన్నా మిన్న
సంస్కారమే రన్న
సంస్కరింపలేని
చదువేలరన్న  13.

గడ్డాలనే పెంచు
కాషాయమే కట్టు
జ్ఞాని నంచు చెప్పు
జనులనే ముంచు   14.

దోచి నోడి కంటె
దాచి నోడే పెద్ద
దొంగరా నిజము
ధాత్రియందు   15.

మానవత్వ మన్న
మరి యేమొ కాదురా
ప్రేమతత్వమేర
కరుణ యేరా!  16.

గుర్వింద గింజలే
తెల్గు ప్రేమికులు
వారింటి పిల్లలే
ఆంగ్ల మాధ్యమాలు  17.

నా మాటలు
చేదుగా వుంటాయి
ఆరోగ్యాన్నిచ్చే
మాత్రల్లా    18.

బతుకు భారాన్ని
భారంగా మోస్తాను
నీ వొచ్చేవరకు
ఓ మరణమా    19.

దేవుడై వెలగాలి
జన్మమిచ్చిన తండ్రి
కాముడై కాటేస్తే
కాపెవ్వరింక   20.

వారు సమ్మె జేస్తె
సాలరి పెరిగె
ఆ భారమంతా
మనపై నొరిగే  21.

పెరుగుతుంది
ఆధునికత
ధీటుగా తరిగె నంట
మానవత    22.

మింట చుక్కలె
తెల్లబోయాయి
చెంతచేరిన ధరల
ధగ ధ్ధగల్గాంచి   23.

No comments:

Post a Comment