Wednesday 3 June 2015

మల్లెల సుగంధం పట్టని తుమ్మెద

మల్లెసుగంధం పట్టని తుమ్మెద

గదిలో వ్యాపించిన చీకట్లను
తరిమి కొట్టాలని విశ్వ ప్రయత్నం
చేస్తున్న చిరుదీపం ఓడిపొతూ  గెలుస్తుంది

మసక వెలుతురు నిండుకున్న
ఆ గదిలో కాంక్షల కొలిమిలో
కాగుతున్న రెండు శరీరాలు
సుఖ సాగరంలో తేలియాడాలని
స్వర్గపు అంచులనందుకోవాలని
ఆరాట పడుతున్నాయ్ 

ఒక జత కళ్ళల్లో కోరుకున్నది
చేరుకోవాలన్న కాంక్ష కాంతులై
వెల్లి విరుస్తుంటే.........

మరొజత కళ్ళలొని కాంక్షను
సిగ్గు ఓడిస్తుందేమో.....కనులు
అరమోడ్పులయ్యాయి
చూపులు స్వాగతిస్తున్నా రెప్పలు
వద్దంటున్నాయ్ ....ముకుళించుకు
పోతున్నాయ్

సఖుని చెంతకు చేరాలొ వద్దొ
తెలియని సందిగ్దావస్థలో ఆమే

బిడియంతో తనువు కంపిస్తుంది చిన్నగా
అధరాలు వణుకుతున్నాయ్ సన్నగా
స్వేదబిందువులు ఆణిముత్యాలై
పాలభాగం నుండి ముంగురుల నెంగిలి చేస్తూ కపోలాలపైకి జారుతున్నాయ్

శిల్పి చెక్కిన పాలరాతీ శిల్పంలా
ముకిళించుకు పోయిన ముగ్దసౌందర్యాన్ని
నుదుటిపై నుండి జారి ముద్ద
మందారాల్లాంటి బుగ్గలపై విరిసిన
తుషారబిందువుల్లా మిలమిల మెరిసే
స్వేదబిందువుల నాశగా చూస్తూ
చెంతచేరి వణుకుతున్న యామెను
తన కౌగిట్లో బంధించి జిహ్వాగ్రంతో
ఆ ముత్యపు చినుకును అద్దుకుంటుంటే
ఆమే సిగ్గుల మొగ్గై ఇంకా ఇంకా హత్తుకు
పోయిందీ....

అతని నును వెచ్చని ఊపిరికీ
ఆమె ముంగురులు కదులుతున్నాయి
అతని గాఢ పరిష్వంగంలో అభద్రతను
వీడిన దానిలా.....అలాగే కళ్ళుమూసుకొని
అతుక్కు పోయిందతని వక్షంపై

అతని కళ్ళలోకి చూడాలంటేనే సిగ్గు
అతడికి దూరంగా వుండలేననే భయం

సంపాదన కోసం సముద్రాలు దాటి
నాలుగేళ్ళ తర్వాత తనని చేరిన భర్త
వదలాలని లేదు.....కాని....
స్త్రి సహజమైన సిగ్గుతో
చంద్రుని బాసిన కలువలా
ముడుచుకు పోతుంది

అతని యదపై తలానించి అలాగే
యుగ యుగాలుగా వుండిపొవాలని
యామె యారాటం

వచ్చిన పని పుర్తి చేసుకొవాలన్న
అతని ఆరాటం....
నాలుగేళ్ళుగా దూరమైన దానిని
క్షణంలొనే పోందాలని అతని
మనసు ఆరాట పడుతుంటె

క్షణం కూడా ఆలస్యం చేయకూడదని
ఆత్రుతగా ఆమెను చేతులపై కెత్తుకుని
మంచంకేసి అడుగేసాడు.....
మగాడుగదా........ ఆమె మనసుతో గాని
భావాలతో గాని అతనికేం పని.....

No comments:

Post a Comment