Friday 5 June 2015

పేదతనోద్ధరణ

జరుగుతోంది పేదతనోద్ధరణ

స్వతంత్ర్య భారతం
షష్టిపూర్తి చెసుకొని
దశాబ్దానికి చేరువౌతున్నా
దశమారని పేదరికం
బిక్కు బిక్కు మంటూ
దరిద్రరేఖకు అట్టడుగున
పడి కొట్టుకుంటూనే వుండగా
మేమున్నామంటూ ఈ మధ్య
మధ్యతరగతి వారు చేరుతున్నారు

ఆనాటినుండి ఈనాటి వరకు
నాయకులనే వాళ్ళ మాటలు
వాగ్దానాలూ పేదజనోద్ధరణే యైనా
ఆ మాటలు నీటి మూటలై
పేదతనానికే పెద్దతనమొచ్చింది
పేదజనోద్ధరణ చేస్తామని చెబుతున్న
నేతలు పేదతనో ద్ధరణ చేస్తునే యున్నారు

అసమ దీయులని అందలాలెక్కిస్తూ
తసమదీయులని పాతాళానికి తొక్కెస్తూ

పరాయి పాలకులు దోచారని
తెల్లదొరల ని తరిమి కోడితే నేమి
స్వదేశీ దోపిడి సహస్రశీర్షాలతో
విశ్వరూప ప్రదర్శన గావిస్తూనే వుంది

పరాయి వాడి చేతుల్లో దొచబడే కంటే
మనవాడే మనని దోస్తున్న ఆనందమే
అనంతానంద మందాకినయింది.



No comments:

Post a Comment