Saturday 6 June 2015

విధి వంచిత

విధివంచిత

నువ్వు బతకాలనీ
నీ భారమైన బాధ్యతలను
బతికించు కోవాలనే నువ్
ఆరాటంతో చేసే పోరాటంలో
విధి మార్చిన వంచిత వీవు

నీకు నీవుగా నీ శరీరమనే
రక్త మాంసాల ముద్దను
విఫణీ వీధిలో అమ్మకానికి
పెట్టుకున్న  ఓ అంగడీబొమ్మా!

వ్యధా భరితమైన నీ జీవితం
బతుకు పుస్తకంలో సిరామరకలతో
మలినమైన ఓ తెల్లని కాగితం
అక్షరాల కందని అనంతాశ్రువుల
సమ్మిళిత శైవలినీ తరంగాని వీవు

గాలివాటుగా అనిశ్చలమైన
జీవన గమనపు గమనంలో
ఆగమ్య గోచరానివి నీవు....
కులట యన్న మాటల మోయుట
కన్న బరువైన మూటలు మోయుట
మిన్నని ........
కూలీగా అంకురమైన నీ జీవన
గమనంలో పెత్తందారీ పేడచూపులో
కందిన దౌర్భాగ్యానివి నీవై

కలిగిన కామాంధుడి కబంధ
హస్తాలలొ కాంక్షాగ్నుల జ్వాలల్లో
మాడి మసై పోయిన జీవచ్ఛవానివి నీవు


No comments:

Post a Comment