Wednesday 3 June 2015

ఆకటి పక్షులు

ఆకటిపక్షులు

పిడీకెడంత పిట్టలో
చిటికెడంత గుండే
చిటికెడంత గుండె లో
గగన మంత మనసు
గగనమంత మనసు నిండ
ప్రేమతత్వమే వుండె నిండా

పూర్వాద్రులకా బాలభానుడు
కెంజాయరంగు నద్దీయద్దకనే
గూడువిడచి కూనన్విడచి
పేగు బంధాల పోట్టనింపనెంచి
తరలిపోవు దశదిశలకు
ఆహారాణ్వేషణకూ.......

పిట్టకున్న మనసులో
పిసరంతైనను లేని
పెనురాయే యీ మనిషి
ప్రేమబంధాలను మరచి
కన్న వారిని గాలికోదిలి
బాధ్యతలను వీధి కోదిలి
పసివాడని చేతులకూ
పలకాబలపంబివ్వ మరచి
పలుగూపారలనిచ్చి
బండలనే కోట్టించెడు
పాషాణపు గుండెలాయె

నకనక లాడెడు కడుపులే
భగభగ మండక ముందే
క్షుదాగ్ని జ్వాలలెగసి
ప్రళయాగ్నిగ మారకుండ
క్షుద్బాధను తీర్చవలెను
అక్షరాలు నేర్ప వలెను
ప్రణాళికల రచియించి
ప్రమాదాన్ని నివారించు



No comments:

Post a Comment