Tuesday 2 June 2015

నీ సుఖం కోసం

నీ సుఖం కోసం.......

అధరాలతో నా మధురసాలను గ్రోలాలని
నీ బండబారిన పెదాలతో నను చుంబిస్తుంటావ్
నా నడుముపై కదలాడు నీ వ్రేళ్ళ నైపుణ్యానికి
నన్ను నేనే మరచి ఫోతూ  నీ కనుకూలంగా
మారుతుంటాను, 

నన్నెక్కడెక్కడో తాకుతుంటావ్
నా అణువణువునూ స్పృషిస్తూ
నాలో వేడిని రగిల్చి
నీ కోర్కె తీర్చుకుంటావ్ 

నీవు నాలో రగిల్చిన నిప్పు
నన్ను అణువణువునూ
దహించి వేస్తుంటే  తాలలేని
నేను ననునేను మరిచి నీ
కనుకూలంగా మారుతూ
నీకు తృప్తీనీ  కలిగీస్తున్నాను

నీ తృప్తీ కోసం నీ సుఖాల కోసం
అనుక్షణం దహించుకు పోతున్నా
రెండు నిమిషాల నీ సుఖం కోసం
నన్ను బలిపశువుని చేసి నీ సుఖం
తీరగానే నను విసిరి వేసినా యేమీ
చేయలేక మూగగా రోదిస్తున్న
విధి వంచితులమనీ కుములుతున్నా!

నేను అన్యాయమై పోతున్నా
నీ గురించే ఆలోచిస్తున్నా!
ఓ మనిషీ!!

నన్ను పొందడంలో నీకు రెండు
నిమిషాల ఆనందముండోచ్చు
కానీ అదే నీ జీవితానికి శాపమనీ
గ్రహించడం లేదు. మా ఉసురు
నీకు తగలక పోదు.

తెలిసి తెలిసి నీ వినాశనానికి
నన్ను వాడుకుంటున్నావే
అనీ బాధపడుతున్నా! అయినా
నేనేం చేయగలను,,

నాలుగంగుళాలున్న
సిగరెట్టు ముక్కను
కాలి బూడిదై మిగిలిన
శేషభాగాన్ని మురికి
గుంటలోకి విసిరి వేయ
బడే దానను కదా!! అచేతనురాలను కదా!!


No comments:

Post a Comment