Thursday 4 June 2015

నేటి శకుంతలలు

మార్పెరుగని శకుంతలలు

ఓ ప్రియా!
ఊరించే ఊహల పల్లకి నెక్కించి
కలల లోకాలలో విహరింప జేస్తావు
మధురమైన మాటలతో మత్తెక్కించి
మా మనసులనే దోచుకుంటావు

కోదమ తేటువు నీవు
పూవు పూవున వ్రాలి సేకరించిన
మధువునంతా మనసులో దాచావేమో
నీవాడే ఊసులన్నీ మకరందాలే!

నీ వెంతటీ సరసుడవో తెలుసు
ఇంకెంతటి రసికుడవో తెలుసు
అయినా నీ కొరకే మా మనసులు
కలవరిస్తుంటాయి పరవశిస్తుంటాయి

దైవదత్తమైన నీ మనోహర రూపం
నీకు వరమైతే కావచ్చును కాని
నాలాంటి అనాఘ్రాత పుష్పాలకు
శాపమైందీ

ఎన్నెన్ని సుకుమార అనాఘ్రత
పుష్పాలను నలిపి వేసావో!!
కసాయినే నమ్మిన గొర్రెలమై
నిన్నే నమ్ముతుంటాం

నీ కళ్ళల్లో చిలిపిదనం
మాటల్లో తీయదనం
నడకలలో గాంభీర్యం
చర్యల్లో దుడుకుదనం
నా మనసును ....నా మనసునే కాదు
నాలాంటి యెందరో కన్నె పిల్లల మనసుల్ని
దోచాయీ దోచుకుంటూనే వున్నాయి.

ఎన్ని తరాలు మారినా
ఎన్ని చరిత్రలు చదివినా
మాలో రానే రాదు మార్పు
నీలాంటి దుశ్యంతుల మాటలకూ
చేతలకూ కరిగి మైమరచి పోతాం
ఆనక....తీట్టుకుంటాం నిన్నల్లరీ పెడతాం
అల్లరి పాలైన మా బతుకులని గూర్చి రోదీస్తాం

పై పై మెరుగులకే ఆకర్షింప బడడం
మా బలహీనత... మా బతుకులతో
ఆడుకోవడం మీ లాంటి తుమ్మెదలవ్యసనం
తరతరాల చరిత నేటి శకుంతలల చరిట

No comments:

Post a Comment